ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ మార్గాల్లో MMTS రైళ్లు పాక్షికంగా రద్దు.. కారణం ఏంటంటే..!
MMTS Trains Cancellation: వివిధ కారణాల వల్ల హైదరాబాద్‌లోని పలు ఎంఎంటీసీ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఏయే తేదీల్లో ఈ రైళ్లు రద్దు కానున్నాయో తెలుసుకుందాం.. అయితే ఎంఎంటీఎస్ లో ప్రయాణించే ప్రయాణికులు...
MMTS Trains: రైల్వే నిర్వహణ కారణాల (Operational reasons) వల్ల హైదరాబాద్ నగరంలో నడిచే పలు MMTS రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 10 నుండి జూన్ 12 వరకు వేర్వేరు తేదీల్లో ఈ మార్పులు అమలులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతాల్లో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తుగా గమనించడం చాలా ముఖ్యం. పాక్షికంగా రద్దయిన రైళ్లు, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.