AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Parcel: ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేస్తున్నారా..? ఆన్‌లైన్‌లోనూ బుకింగ్ చేసుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా..

రైళ్ల ద్వారా బైక్‌లను పార్శిల్ చేయడం మనం చూస్తుంటాం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బైక్‌లను ట్రైన్ ద్వారా సులువుగా పంపవచ్చు. ఇందుకు ముందుగానే బుకింగ్ చేసుకుని ఛార్జీలు చెల్లించాలి. గతంలో కేవలం ఆప్‌లైన్‌లో మాత్రమే బుకింగ్ అవకాశం ఉండగా.. ఇప్పుడు ఆన్ లైన్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది.

Bike Parcel: ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేస్తున్నారా..? ఆన్‌లైన్‌లోనూ బుకింగ్ చేసుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా..
Bike Parcel
Venkatrao Lella
|

Updated on: Sep 28, 2026 | 8:06 PM

Share

ట్రైన్ల ద్వారా ఎలక్ట్రానిక్, బైక్‌లు, కొన్ని వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పార్శిల్ చేయవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. ఎక్కువమంది బైక్‌లను ట్రైన్లో పార్శిల్ చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. సులువుగా రైళ్ల తర్వాత బైక్‌లను పంపవచ్చు. అంతేకాకుండా ఛార్జీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ పార్శిల్ ఏజెన్సీల ద్వారా పంపించాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. అదే రైళ్ల ద్వారా సురక్షితంగా, తక్కువ ఖర్చులో పంపించవచ్చు. గతంలో కేవలం పార్శిల్ కార్యాలయానికి వెళ్లి మాత్రమే బుకింగ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్ లైన్ విధానం కూడా అమల్లోకి వచ్చింది. ఆన్‌లైన్ ద్వారానే బైక్‌ను పార్శిల్ చేసేందుకు బుకింగ్ చేసుకోవచ్చు. దేశంలోని ఏ ప్రాంతానికి అయినా రైళ్ల ద్వారా బైక్‌లను ఆన్‌లైన్‌లో పార్శిల్ బుకింగ్ చేసి పంపించవచ్చు. గతంలో కేవలం ఆఫ్‌లైన్ బుకింగ్ మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం కూడా రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖాళీ ఉంటే ప్యాసింజర్ ప్రయాణించే రైల్లో కూడా బైక్‌ను పంపించే అవకాశముంది. రూటును బట్టి అత్యంత వేగంగా పంపించేందుకు రైల్వేశాఖ ప్రయత్నాల చేస్తోంది.

ఆన్‌లైన్‌లో ఎలా పార్శిల్ బుకింగ్ చేయాలి..?

-https://parcel.indianrail.gov.in/ పోర్టల్ తెరవాలి

-హోం పేజీలో పార్శిల్ సర్వీస్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి

– Sign Upపై క్లిక్ చేసి వివరాలను ఎంటర్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

-ఆ తర్వాత ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి

-ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్‌కు పంపాలనే వివరాలు నమోదు చేయాలి

-అనంతరం ఛార్జీల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి

-ఆ తర్వాత ఫార్వార్డింగ్ నోట్ జనరేట్ అవుతుంది. దీనిని ప్రింట్ తీసుకోవాలి

-స్టేషన్‌కు వెళ్లి బైక్, ఫార్వార్డింగ్ నోట్ అందించాలి

-ఛార్జీలు చెల్లించి రసీదు తీసుకోవాలి

-రైల్వే సిబ్బంది ఇచ్చే నెంబర్ ద్వారా మీపార్శిల్ ఎక్కడ ఉందనేది ట్రాకింగ్ చేయవచ్చు

ఆఫ్‌లైన్‌లో బుకింగ్ ఎలా..?

ముందుగా సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడి పార్శిల్ కార్యాలయాన్ని సంప్రదించి పార్శిల్ బుకింగ్ ఫారం తీసుకోవాలి. ఆధార్ కార్డు, బైక్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి వివరాలు నమోదు చయాలి. ఈ తర్వాత బైక్ బరువు, పార్శిల్ పంపే దూరాన్ని బట్టి ఛార్జీలు నిర్ణయిస్తారు. ఆ ఛార్జీలను చెల్లిస్త రిసిస్ట్ అందిస్తారు. ఆ తర్వాత బైక్‌ దెబ్బతినకుండా పార్శిల్ చేసేందుకు అదనంగా కొంత చెల్లించాల్సి ఉంటుంది. బైక్ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత రిసిస్ట్ అందిస్తే మీ బైక్ అప్పగిస్తారు.

Follow Us
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ఆ హీరోతో యాక్టింగ్ అంటే భయం.. అతడు గొప్ప నటుడు..
ఆ హీరోతో యాక్టింగ్ అంటే భయం.. అతడు గొప్ప నటుడు..
రైతులకు కాసుల వర్షమే.. తక్కువ నీటితో నెల తిరిగేసరికి జేబు నింపే..
రైతులకు కాసుల వర్షమే.. తక్కువ నీటితో నెల తిరిగేసరికి జేబు నింపే..
రాత్రి దానిమ్మ ఆకుల కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా?
రాత్రి దానిమ్మ ఆకుల కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా?
అన్నా ఇది నువ్వేనా? ధనుష్‌తో ఉన్న ఈటాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
అన్నా ఇది నువ్వేనా? ధనుష్‌తో ఉన్న ఈటాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
జావెలిన్ త్రోలో భారత్ డబుల్ ధమాకా
జావెలిన్ త్రోలో భారత్ డబుల్ ధమాకా
విండీస్ పై సిక్సర్ల వర్షం..మూడేళ్ల రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
విండీస్ పై సిక్సర్ల వర్షం..మూడేళ్ల రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
కుక్క కాటు మాత్రమే కాదు.. ఇవి కరిచినా రేబీస్‌ ముప్పు!
కుక్క కాటు మాత్రమే కాదు.. ఇవి కరిచినా రేబీస్‌ ముప్పు!
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్
క్రిస్పీ రింగ్ స్నాక్స్.. ఒక్కటి తింటే గిన్నె ఖాళీ చేసేయడం ఖాయం!
క్రిస్పీ రింగ్ స్నాక్స్.. ఒక్కటి తింటే గిన్నె ఖాళీ చేసేయడం ఖాయం!