AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ePassport: ఇ–పాస్‌పోర్ట్ వచ్చేసింది! సింపుల్‌గా ఇలా అప్లై చేస్తే ఇంటికొచ్చేస్తుంది!

భారత విదేశాంగ శాఖ సరికొత్త ఇ–పాస్‌పోర్ట్ ను తీసుకొచ్చింది. పేపర్ ప్రింటింగ్ పాస్ పోర్ట్ లకు బదులు డిజిటల్ ఫార్మాట్ లో ఉండే కొత్త రకం పాస్ పోర్టును అందుబాటులోకి తెచ్చింది. దీంతో అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ePassport: ఇ–పాస్‌పోర్ట్ వచ్చేసింది! సింపుల్‌గా ఇలా అప్లై చేస్తే ఇంటికొచ్చేస్తుంది!
Epassport
Nikhil
|

Updated on: Oct 15, 2025 | 12:43 PM

Share

విదేశీ ప్రయాణాలు చేయాలంటే తప్పనిసరిగా పాస్‌పోర్ట్ ఉండాలి. అయితే పాస్‌పోర్ట్‌ల విషయంలో జరిగే మోసాలను అరికడుతూ ప్రభుత్వం డిజిటల్ పాస్‌పోర్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. పాస్ పోర్ట్ భద్రతను మెరుగుపరచడం, విదేశీ ప్రయాణాలను స్ట్రీమ్‌లైన్‌ చేయడం, నకిలీ పాస్‌పోర్ట్ లను నిరోధించడం, ట్యాంపరింగ్‌ నుంచి పాస్‌పోర్ట్‌ హోల్డర్ల వ్యక్తిగత డేటాను సంరక్షించడం కోసం ఈ కొత్త డిజిటల్ పాస్‌పోర్ట్ తెచ్చినట్టు తెలుస్తోంది.

ఎలక్ట్రానిక్‌ చిప్‌తో..

ఇ–పాస్‌పోర్ట్ కూడా సంప్రదాయ పేపర్‌ డాక్యుమెంట్‌ వంటిదే. అయితే ఇది డిజిటల్ రూపంలో ఉంటుంది. పాస్‌పోర్ట్‌ కవర్‌పై బంగారు వర్ణపు ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. లోపల ఎలక్ట్రానిక్‌ చిప్‌ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ ( RFID) టెక్నాలజీతో ఈ డిజిటల్ పాస్‌పోర్ట్‌ అనుసంధానమై ఉంటుంది. పాస్‌పోర్ట్‌ కవర్‌లో చిప్‌, యాంటెన్నా వంటివి ఉంటాయి. ఈ చిప్ లో వ్యక్తిగత డేటా నిక్షిప్తమై ఉంటుంది. డిజిటల్ పాస్‌పోర్ట్ ద్వారా ఎయిర్‌‌పోర్ట్ ల్లో అథెంటికేషన్‌ ఈజీగా జరిగిపోతుంది.

అప్లికేషన్ ప్రాసెస్

  • ఇ–పాస్‌పోర్ట్ కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ (passportindia.gov.in) లేదా పాస్‌పోర్ట్ సేవా యాప్ (mpassport seva app) లోకి వెళ్లాలి. అక్కడ మీ డీటెయిల్స్ తో ముందు రిజిస్టర్ అవ్వాలి.
  • తర్వాత మీ రిజిస్టర్డ్ ఐడితో ఉపయోగించి లాగిన్ అయ్యి న్యూ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయాలి.
  • తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసి.. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.
  • అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత రసీదును ప్రింట్ చేసి లేదా పీడియఫ్ రూపంలో సేవ్ చేసుకోవాలి.
  • అపాయింట్‌మెంట్ రోజున ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో  ఎంచుకున్న పాస్ పోర్ట్ ఆఫీసుకి వెళ్లాలి.
  • అక్కడ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ కొత్త ఇ–పాస్‌పోర్ట్ మీ రిజిస్టర్డ్ అడ్రెస్ కు డెలివరీ అవుతుంది.

అయితే ప్రస్తుతం ఇపాస్‌పోర్ట్‌ సేవలు హైదరాబాద్‌, గోవా, ఢిల్లీ నాగ్‌పూర్‌, చెన్నై, భువనేశ్వర్‌, జమ్ము, సిమ్లా, రాయ్‌పూర్‌, అమృత్‌సర్‌, జైపూర్‌, సూరత్‌, రాంచీ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే దేశంలోని అన్ని పాస్‌పోర్ట్‌ కేంద్రాలకు అందుబాటులోకి వస్తాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

లండన్ - బెంగళూరు ఎయిరిండియా ఫ్లైట్‌లో సాంకేతిక లోపం!
లండన్ - బెంగళూరు ఎయిరిండియా ఫ్లైట్‌లో సాంకేతిక లోపం!
చాహల్ భయ్యా 'నో మనీ.. నో హనీ' వెనుక అసలు కథేంటి?
చాహల్ భయ్యా 'నో మనీ.. నో హనీ' వెనుక అసలు కథేంటి?
గిన్ని కోళ్లు, నాటుకోళ్లు కలిసి పెరిగితే ఏం జరుగుతుంది?
గిన్ని కోళ్లు, నాటుకోళ్లు కలిసి పెరిగితే ఏం జరుగుతుంది?
అనుపమ వద్దు.. ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటా..
అనుపమ వద్దు.. ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటా..
ఈ 6 లక్షణాలు ఉంటే మీకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ..అవేంటో తెలుసా?
ఈ 6 లక్షణాలు ఉంటే మీకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ..అవేంటో తెలుసా?
మతమార్పిడి నిరోధక చట్టాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
మతమార్పిడి నిరోధక చట్టాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
భారత్ పాక్ మ్యాచ్ లేకపోతే రూ.4500 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?
భారత్ పాక్ మ్యాచ్ లేకపోతే రూ.4500 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సుంకం లేకుండా లగేజీ పరిమితి పెంపు!
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సుంకం లేకుండా లగేజీ పరిమితి పెంపు!
అవేమన్న రబ్బర్ ట్యూబులు అనుకున్నావా..?
అవేమన్న రబ్బర్ ట్యూబులు అనుకున్నావా..?
ఈ జబర్దస్త్ కమెడియన్ గ్రేట్ ! 2కోట్లతో సొంతూరిలో తల్లిదండ్రులకు..
ఈ జబర్దస్త్ కమెడియన్ గ్రేట్ ! 2కోట్లతో సొంతూరిలో తల్లిదండ్రులకు..