EPF Account: మీ పీఎఫ్ ఖాతా నుంచి లక్ష వరకు విత్‌డ్రా చేస్తున్నారా.? అయితే భారీగా నష్టపోవాల్సిందే.!

|

Apr 05, 2021 | 3:18 PM

EPF Account Rules: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? తరచూ అవసరాలకు డబ్బులను విత్‌డ్రా చేస్తున్నారా.! అయితే ఈ విషయాన్ని తెలుసుకోండి...

EPF Account: మీ పీఎఫ్ ఖాతా నుంచి లక్ష వరకు విత్‌డ్రా చేస్తున్నారా.? అయితే భారీగా నష్టపోవాల్సిందే.!
Pf Account
Follow us on

EPF Account Rules: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? తరచూ అవసరాలకు డబ్బులను విత్‌డ్రా చేస్తున్నారా.! అయితే ఈ విషయాన్ని తెలుసుకోండి. అత్యవసరానికి తప్పితే.. పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయొద్దని బిజినెస్ నిపుణులు అంటున్నారు. పీఎఫ్ ఖాతా ఓ పొదుపు అకౌంట్ అని.. అందులో ఉన్న సేవింగ్స్ క్రమేపీ పెరుగుతాయని.. దానిపై మంచి వడ్డీ వస్తుందని చెబుతున్నారు. .

మీరు పదవీ విరమణకు కొన్ని సంవత్సరాల ముందు ఈ డబ్బును ఉపసంహరించుకుంటే, మీరు ఖచ్చితంగా నష్టాన్ని చవి చూడాల్సిందే. మీరు మీ పీఎఫ్ ఖాతా నుంచి రూ. లక్ష ఉపసంహరించుకున్నట్లయితే, రూ. 11 లక్షలు కోల్పోతారు. అసలు ఇది ఎలా జరుగుతుంది.? పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు ఎందుకు ఉపసంహరించుకోకూడదు.! అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మీరు పీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రా చేసిన సొమ్ము మీ రిటైర్మెంట్ ఫండ్‌పై ప్రభావం చూపిస్తుంది. జాతీయ మీడియా Money 9 నివేదిక ప్రకారం రిటైర్డ్ ఇపిఎఫ్‌ఓ అసిస్టెంట్ కమిషనర్ ఎ.కె. శుక్లా మాట్లాడుతూ.. ” మీ రిటైర్మెంట్ కాలం ఇంకా 30 సంవత్సరాలు మిగిలి ఉంటే, మీరు పిఎఫ్ ఖాతా(ఈపిఎఫ్ ఉపసంహరణ) నుండి 1 లక్ష రూపాయలు ఉపసంహరించుకుంటే, అప్పుడు మీ రిటైర్మెంట్ ఫండ్ నుంచి రూ. 11.55 లక్షలు కోల్పోయినట్లే. వాస్తవానికి, మీరు 1 లక్ష రూపాయలు జమ చేసి ఉంటే, మీకు దానిపై వడ్డీ వచ్చేది.. చివరికి మొత్తం రూ .11.55 లక్షల అయ్యేది.

మీకు డబ్బు అవసరం లేకపోతే, మీరు ఈపీఎఫ్ నుండి డబ్బును ఉపసంహరించవద్దని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఈపీఎఫ్ ఖాతా 58 సంవత్సరాల వరకు యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ అకౌంట్‌పై 8.5 శాతం వడ్డీ లభిస్తోంది. అన్ని రకాల చిన్న పొదుపు పథకాలలో ఇదే అత్యధికం. అందుకే ఈపీఎఫ్ ఖాతాలో ఎంత ఎక్కువ మొత్తం ఉంటే.. అంత రాబడి వస్తుంది.

ఒకవేళ మీ రిటైర్మెంట్ కాలం ఇంకా 20 సంవత్సరాలు ఉండి.. మీరు 50 వేల రూపాయలు ఉపసంహరించుకుంటే, మీరు 2 లక్షల 5 వేల రూపాయలను కోల్పోతారు. అదేవిధంగా 1 లక్ష రూపాయలకు 5 లక్షల 11 వేల రూపాయలు, 2 లక్షల రూపాయలకు 10 లక్షల 22 వేల రూపాయలు, 3 లక్షల రూపాయలకు 15 లక్షల 33 వేల రూపాయలు కోల్పోతారు.

అదే పదవీ విరమణ సమయం ఇంకా 30 సంవత్సరాలు ఉంటే.. మీరు పీఎఫ్ ఖాతా నుంచి 50 వేల రూపాయలు ఉపసంహరించుకుంటే, అప్పుడు 5 లక్షల 27 వేల రూపాయలు నష్టపోతారు. అదే సమయంలో 1 లక్ష రూపాయలకు 11 లక్షల 55 వేల రూపాయలు, 2 లక్షల రూపాయలకు 23 లక్షల 11 వేల రూపాయలు, 3 లక్షల రూపాయలకు 34 లక్షల 67 వేల రూపాయలు నష్టం వాటిల్లుతుంది.

Also Read:

Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!

Scary Video: ”నువ్వు తోపు.. అయితే నాకేంటి”.. మొసలిని లెక్క చేయని జీబ్రా.. ఏం జరిగిందంటే.!

అద్భుత రికార్డు.. 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!