AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: జీతం తక్కువున్నా లోన్ పక్కా.. ఈ రూల్స్ పాటిస్తే చాలు.. నిమిషాల్లోనే అకౌంట్లో డబ్బులు..

అవసరానికి చేతిలో డబ్బు లేనప్పుడు చాలామంది ఆశ్రయించేది పర్సనల్ లోన్. అయితే జీతం తక్కువగా ఉంటే బ్యాంకులు రుణం ఇవ్వవని చాలామంది భయపడుతుంటారు. కానీ వాస్తవానికి మీ జీతం రూ.30,000 కంటే తక్కువ ఉన్నా కూడా కొన్ని బ్యాంకింగ్ సూత్రాలను పాటిస్తే లక్షల్లో రుణం పొందే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Personal Loan: జీతం తక్కువున్నా లోన్ పక్కా.. ఈ రూల్స్ పాటిస్తే చాలు.. నిమిషాల్లోనే అకౌంట్లో డబ్బులు..
How To Get A Personal Loan With Low Salary
Krishna S
|

Updated on: Mar 08, 2026 | 10:31 PM

Share

చాలామంది తమ జీతం తక్కువగా ఉందని, తమకు పెద్ద మొత్తంలో రుణం లభించదని భావిస్తుంటారు. కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న కొన్ని సూత్రాలను అర్థం చేసుకుంటే.. రూ.30 వేల కంటే తక్కువ జీతం ఉన్న వారు కూడా సులభంగా రూ.1.5 లక్షల నుండి రూ.4.5 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందే అవకాశం ఉంది. అసలు బ్యాంకులు మీ లోన్ అర్హతను ఎలా లెక్కిస్తాయి? మీ సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఏమిటీ FOIR నియమం?

రుణదాతలు మీ లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని FOIR ఆధారంగా లెక్కిస్తారు. దీని ప్రకారం.. మీ నెలవారీ జీతంలో 40-50శాతం మాత్రమే EMIగా చెల్లించడానికి బ్యాంకులు అనుమతిస్తాయి. మీ జీతం రూ. 30,000 అయితే మీరు రూ.12-15 వేల వరకు EMI చెల్లించగలరని బ్యాంక్ భావిస్తుంది. దీనివల్ల మీకు రూ.3 నుండి 4.5 లక్షల వరకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రూ.25,000 జీతం ఉన్నవారికి రూ.2-3 లక్షలు, రూ. 20,000 జీతం ఉన్నవారికి రూ. 1.5 నుండి 2 లక్షల వరకు రుణం లభించవచ్చు.

సిబిల్ స్కోర్

కేవలం జీతం ఉంటే సరిపోదు మీ క్రెడిట్ చరిత్ర ఇక్కడ చాలా ముఖ్యం. 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే మీకు చాలా సులభంగా, తక్కువ వడ్డీ రేటుకే రుణం లభిస్తుంది.700-750 మధ్యలో ఉంటే రుణం లభిస్తుంది కానీ వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. 650 కంటే తక్కువగా ఉంటే సాధారణ బ్యాంకుల్లో లోన్ కష్టమవుతుంది. అప్పుడు మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ లేదా టాటా క్యాపిటల్ వంటి NBFCలను ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే అక్కడ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి.

అర్హతలు – అవసరమైన పత్రాలు

పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసేవారి వయస్సు 21 నుండి 60 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం 6 నెలల నుండి ఏడాదిన్నర పాటు ఒకే చోట పనిచేసిన అనుభవం ఉంటే లోన్‌కు త్వరగా ఆమోదం దక్కుతుంది. దీనికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, గత 3 నెలల శాలరీ స్లిప్స్, గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ అవసరమవుతాయి.

పెద్ద మొత్తం రుణం పొందడానికి చిట్కాలు

పాత బకాయిలు క్లియర్ చేయండి: కొత్త లోన్ కోసం వెళ్లేముందు మీ పాత EMIలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించండి.

కాలపరిమితి పెంచండి: లోన్ టెన్యూర్ ఎక్కువగా ఉంచుకుంటే నెలవారీ EMI తగ్గి, ఎక్కువ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది.

సొంత బ్యాంక్: మీ శాలరీ ఏ బ్యాంకులో పడుతుందో అక్కడే మొదట దరఖాస్తు చేయండి. అక్కడ మీ డేటా ఇప్పటికే ఉంటుంది కాబట్టి ప్రాసెస్ వేగంగా జరుగుతుంది.

తక్కువ వడ్డీ ఇస్తామని చెప్పే తక్షణ రుణ యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకేసారి నాలుగైదు బ్యాంకుల్లో లోన్ కోసం దరఖాస్తు చేయకండి. ఒకవేళ అక్కడ రిజెక్ట్ అయితే ఆ ప్రభావం మీ సిబిల్ స్కోర్‌పై పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు, ఫోర్ క్లోజర్ ఛార్జీల గురించి ముందే ఆరా తీయడం మంచిది.

Follow Us