ఫోన్‌పే మ్యాజిక్.. ఆధార్, పాన్ ఉంటే చాలు.. నిమిషాల్లో రూ.5 లక్షల లోన్..

అత్యవసరంగా డబ్బు అవసరమైందా..? బ్యాంకుల చుట్టూ తిరిగే ఓపిక లేదా..? అయితే మీ స్మార్ట్‌ఫోనే మీకు బ్యాంకులా మారుతుంది. డిజిటల్ చెల్లింపుల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌పే ఇప్పుడు సామాన్యుల అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చేందుకు తక్షణ రుణాలను అందిస్తోంది. ఎలా అప్లై చేసుకోవాలి..? ఎవరికి లోన్లు వస్తాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఫోన్‌పే మ్యాజిక్.. ఆధార్, పాన్ ఉంటే చాలు.. నిమిషాల్లో రూ.5 లక్షల లోన్..
How To Get A Instant Loan In Phonepe

Updated on: Feb 15, 2026 | 12:32 PM

మారుతున్న కాలంతో పాటు బ్యాంకింగ్ సేవలు కూడా అరచేతిలోకి వచ్చేశాయి. అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఎవరినో అప్పు అడగాల్సిన పని లేకుండా క్షణాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్లు ఇస్తున్నాయి. దీంతో లోన్లపై ఆధారపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే సైతం తన వినియోగదారులకు ఇన్‌స్టంట్ లోన్స్ అందిస్తోంది. వివిధ బ్యాంకులు, NBFCలతో ఒప్పందం కుదుర్చుకుని అత్యంత సులభమైన పద్ధతిలో తక్షణ రుణాలను అందిస్తోంది.

ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు

ఈ లోన్ ప్రత్యేకత ఏమిటంటే దీని కోసం మీరు ఎలాంటి ఆస్తి పత్రాలను లేదా బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీ క్రెడిట్ హిస్టరీ, ఆదాయ వనరుల ఆధారంగా ఈ అన్‌సెక్యూర్డ్ లోన్ మంజూరవుతుంది.

లోన్ ముఖ్య అంశాలు:

రుణ మొత్తం: కనీసం రూ. 10,000 నుండి గరిష్టంగా రూ. 5,00,000 వరకు పొందవచ్చు.

వడ్డీ రేటు: ఏటా 11.30శాతం నుండి 35శాతం వరకు ఉంటుంది

తిరిగి చెల్లింపు గడువు: మీ సౌలభ్యాన్ని బట్టి 12 నెలల నుండి 5 ఏళ్లు వరకు ఎంచుకోవచ్చు.

డబ్బు జమ: దరఖాస్తు ఆమోదం పొందిన 72 గంటల్లోనే నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బు వస్తుంది.

ఎవరు అర్హులు?

వయస్సు: 21 ఏళ్ల నుండి 60 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆదాయం: నెలవారీ ఆదాయం కనీసం రూ. 15,000 ఉండాలి.

క్రెడిట్ స్కోర్: సిబిల్ స్కోర్ 650 కంటే ఎక్కువగా ఉంటే లోన్ వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి.

ముఖ్యమైన డాక్యుమెంట్లు

  • ఈ ప్రాసెస్ అంతా పేపర్‌లెస్ పద్ధతిలో జరుగుతుంది. మీ దగ్గర ఇవి ఉంటే సరిపోతుంది..
  • ఆధార్ కార్డ్, పాన్ కార్డ్
  • గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
  • శాలరీ స్లిప్స్

దరఖాస్తు చేసుకునే విధానం

  • ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి, హోమ్ స్క్రీన్‌పై ఉన్న Loans విభాగంలోకి వెళ్లండి.
  • అక్కడ మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి మీ రుణ అర్హతను తనిఖీ చేసుకోండి.
  • మీకు కావాల్సిన లోన్ మొత్తం, కాలపరిమితిని ఎంచుకుని, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • చివరగా మీ EMI, ప్రాసెసింగ్ ఫీజు వివరాలను సరిచూసుకుని దరఖాస్తును సబ్మిట్ చేయండి.

ఫోన్‌పేలో హిడెన్ ఛార్జీలు ఉండవు కాబట్టి ఇది అత్యవసర వైద్య ఖర్చులు లేదా చిన్న వ్యాపార అవసరాలకు సురక్షితమైన మార్గం. సకాలంలో ఈఎంఐలు చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ పెరిగి, భవిష్యత్తులో మరిన్ని పెద్ద లోన్లు సులభంగా పొందే వీలుంటుంది.