Kisan Credit Card: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై ఎంత రుణం పొందవచ్చు.. దీనికి ఎవరెవరు అర్హులు తెలుసుకోండి..

|

Nov 18, 2021 | 6:01 AM

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి)కి సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. రైతులతో పాటు అర్హులైన పశువుల

Kisan Credit Card: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై ఎంత రుణం పొందవచ్చు.. దీనికి ఎవరెవరు అర్హులు తెలుసుకోండి..
Kisan Credit
Follow us on

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి)కి సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. రైతులతో పాటు అర్హులైన పశువుల పెంపకందారులు, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమకి సంబంధించిన వారందరికి కెసిసి అందిస్తామని తెలిపింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించారు. వచ్చే మూడు నెలల్లో దాదాపు రెండు కోట్ల మందిని కేసీసీ కింద చేర్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 15 నుంచి ప్రారంభమైన ఈ ప్రచారం ఫిబ్రవరి 15, 2022 వరకు కొనసాగుతుంది.

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా దీన్ని ప్రారంభించారు. ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో పశువుల రైతులు, మత్స్యకారులకు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడంలో సహాయపడటానికి KCC సౌకర్యాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే కేసీసీపై రూ.1.6 లక్షల రుణం పొందవచ్చు. దాదాపు 50 లక్షల మంది మత్స్యకారులకు క్రెడిట్ కార్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఈ రంగం ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అర్హులైన వ్యక్తులు వెంటనే దగ్గరలోని బ్యాంకులను సంప్రదించి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులని పొందండి.

దరఖాస్తు చేసుకునే విధానం
1.నేరుగా ఎస్బిఐ బ్యాంక్ శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
2. SBI ఆన్ లైన్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.

అవసరమైన పత్రాలు
1. గుర్తింపు కార్డుకు సంబంధించిన ఆధార్ కార్డు, లేదా ఓటర్ ఐడీ, తదితర గుర్తింపు కార్డులు
2.వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు
3.ధరఖాస్తుదారుడి ఫోటోలు
4. ఇంటి చిరునామా

IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన 6 ఏళ్ల బాలిక.. ఏ విషయంలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

విటమిన్‌ ‘E’ లేకుంటే శరీరంలో ఈ రెండు పనిచేయవు..! అందుకే ఈ 5 ఆహారాలు తప్పనిసరి..