
Petrol Pump Profit: మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటినప్పుడల్లా చాలామంది మనస్సులో ఒకే ఆలోచన వస్తుంది. రూ.100 పెట్రోల్ పోస్తే అందులో పెట్రోల్ 1పంప్ యజమాని ఎంత సంపాదిస్తాడు? అసలు లీటరుకు భారీ లాభాలు వస్తాయా? అని అనుకుంటారు. చాలామంది పెట్రోల్ పంప్ యజమానులకు లీటరుపై రూ.5 నుండి రూ.10 వరకు లాభం వస్తుందేమో అని భావిస్తారు. కానీ అసలు నిజం వేరుగా ఉంది. అయితే పెట్రోల్ మార్కెటింగ్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్ పంప్ యజమానులకు (డీలర్లకు) ప్రతి లీటరు అమ్మకంపై నిర్ణీత కమిషన్ (Dealer Commission) అందిస్తాయి. పెట్రోల్‌పై డీలర్‌కు లీటరుకు సుమారు రూ.3.14 నుండి రూ.3.50 వరకు కమిషన్ లభిస్తుంది. ఇందులో స్థిరమైన కమిషన్ తో పాటు ప్రాడక్ట్ బిల్లు ధర ఆధారంగా వచ్చే చిన్న శాతం (0.870%) కమిషన్ కూడా కలుస్తుంది. అలాగే డీజిల్ అమ్మకాలపై డీలర్లకు లీటరుకు సుమారు రూ.2.33 నుండి రూ.2.50 వరకు కమిషన్ అందుతుంది. అయితే కమిషన్ లో మార్పులు కూడా ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: Mukesh Ambani: అంబానీ ఇంట్లో చపాతీలు చేసే హెడ్ చెఫ్ జీతం ఎంతో తెలుసా? ప్యాకేజీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
కాదు.. యజమానికి వచ్చే కమిషన్ వేరు, నికర లాభం (Net Profit) వేరు. ఒక పెట్రోల్ పంప్‌ను రోజూ నడపాలంటే భారీగా నిర్వహణ ఖర్చులు ఉంటాయి. యజమాని తన కమిషన్ నుండి చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులు ఉంటాయి. అవేంటో చూద్దాం..
ఈ అన్ని ఖర్చులనూ మినహాయించిన తర్వాత యజమానికి రూ.100 లీటర్ పెట్రోల్‌పై మిగిలే నికర లాభం కేవలం రూ.1.00 నుండి రూ.1.50 మాత్రమే.
పెట్రోల్ పంప్ అనేది “తక్కువ మార్జిన్ – ఎక్కువ విక్రయాలు” ఆధారంగా పనిచేసే వ్యాపారం. ఒక లీటరుపై తక్కువ లాభం వచ్చినా, రోజువారీ విక్రయాల పరిమాణం ఆధారంగా యజమాని సంపాదన ఆధారపడి ఉంటుంది.
ఒక పెట్రోల్ పంప్‌లో రోజుకు 5,000 లీటర్ల పెట్రోల్ అమ్ముడైతే, డీలర్‌కు వచ్చే మొత్తం కమిషన్ సుమారు రూ.15,700 వరకు ఉంటుంది. నెల మొత్తానికి ఇది దాదాపు రూ.4.70 లక్షల వరకు కమిషన్‌గా మారుతుంది. ఇందులో జీతాలు, కరెంట్ బిల్లులు, ఇతర ఖర్చుల రూపంలో రూ.2 లక్షల నుండి రూ.2.5 లక్షలు పోయినా, యజమానికి నెలకు రూ.2 లక్షలకు పైగా నికర లాభం దక్కుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. అందుకే రోజుకు ఎక్కువ లీటర్ల ఇంధనం అమ్ముడయ్యే హైవేలు లేదా బిజీ సెంటర్లలో ఉండే పంప్ యజమానులు మాత్రమే మంచి లాభాలను పొందగలుగుతారు.
ఇది కూడా చదవండి: Free Treatment: మీకు ఈ కార్డు ఉందా..? హాస్పిటల్‌లో చికిత్స ఖర్చు లక్షల్లో ఉన్నా జీరో బిల్లు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి