Telugu News Business Haven’t Used Your Bank Account for Two Years? RBI Has Good News for You
RBI: రెండేళ్లుగా మీ బ్యాంకు ఖాతాను వాడటం లేదా? ఆర్బీఐ మీకో గుడ్‌న్యూస్..!
Bank Account: మీకు బ్యాంకు ఖాతా ఉందా..? దానిని రెండుళ్లకుపై వాడటం లేదా..?ఎలాంటి లావాదేవీలు జరపడం లేదా? అయితే ఇలాంటి వారిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త తెలిపింది. నిలిచిపోయిన ఖాతాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మీరు నిలిచిపోయిన బ్యాంకు అకౌంట్ గురించి..
RBI: మనలో చాలామంది ఉద్యోగాలు మారినప్పుడు, వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు లేదా కొత్త ఖాతాలు తెరిచినప్పుడు పాత బ్యాంక్ ఖాతాలను వాడటం మానేస్తుంటారు. అయితే, కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోతే ఆ ఖాతా “క్రియారహితం” (Inoperative / Dormant Account) గా మారుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హెచ్చరిస్తోంది. ఆర్బీఐ RBI Kehta Hai అనే పేరుతో అవగాహన ప్రచారంలో భాగంగా ఈ అంశంపై బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోండి.
1. ఖాతా డీయాక్టివేట్‌గా మారుతుందా?
2 సంవత్సరాల పరిమితి: మీ బ్యాంక్ ఖాతాలో (సేవింగ్స్ లేదా కరెంట్) వరుసగా రెండు సంవత్సరాల (24 నెలలు) పాటు ఎలాంటి డిపాజిట్, విత్‌డ్రా లేదా డిజిటల్ లావాదేవీలు జరగకపోతే బ్యాంక్ ఆ ఖాతాను “Inoperative Account”గా గుర్తిస్తుంది. అంటే ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాగా గుర్తిస్తుంది.
సిస్టమ్ లావాదేవీలు మినహాయింపు: బ్యాంక్ ఖాతాలో వడ్డీ జమ కావడం లేదా బ్యాంక్ ఛార్జీలు కట్ కావడం వంటి వాటిని ఖాతాదారుడు చేసిన లావాదేవీలుగా పరిగణించరు. ఖాతాదారుడి స్వయంప్రమేయంతో జరిగే డిపాజిట్/విత్‌డ్రాల్ మాత్రమే పరిగణనలోకి వస్తాయి.
2. ఖాతా ఇన్-ఆపరేటివ్ అయితే ఏమవుతుంది?
సేవలు నిలిపివేత: ATM కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI, చెక్‌బుక్ వంటి సేవల ద్వారా లావాదేవీలు నిర్వహించడం సాధ్యం కాదు.
డబ్బు భద్రం: ఖాతా క్రియారహితంగా మారినా మీ డబ్బు పూర్తి సురక్షితంగా ఉంటుంది.
వడ్డీ జమ అవుతుంది: సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ముపై వచ్చే వడ్డీని బ్యాంకులు నిబంధనల ప్రకారం ఖాతాలో జమ చేస్తూనే ఉంటాయి.
DEA ఫండ్‌కు బదిలీ: 10 సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీలు లేని ఖాతాల్లోని నిధులను బ్యాంకులు ఆర్బీఐ “డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్” (DEA) ఫండ్‌కు బదిలీ చేస్తాయి.
UDGAM పోర్టల్: మీ కుటుంబ సభ్యుల లేదా మీ పాత అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను వెతకడానికి ఆర్బీఐ UDGAM (Unclaimed Deposits – Gateway to Access inforMation) అనే ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
4. అకౌంట్‌ను రీయాక్టివేట్ చేయడం ఎలా?
అకౌంట్‌ను డీయాక్టివేట్‌గా మారితే ఖాతాను తిరిగి పొందడం చాలా సులభం. దీని కోసం కింది ప్రక్రియను అనుసరించవచ్చు:
బ్యాంక్‌ను సంప్రదించడం: మీ బ్యాంక్ శాఖకు (Home Branch లేదా సమీపంలోని ఏ శాఖకైనా) నేరుగా వెళ్లాలి.
Re-KYC వివరాలను సమర్పించడం: మీ గుర్తింపు, చిరునామా వివరాలను అప్‌డేట్ చేయడానికి కింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
వీడియో KYC (Video KYC): అనేక బ్యాంకులు ప్రస్తుతం ఆన్‌లైన్/మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే వీడియో KYC పూర్తి చేసే వెసులుబాటును కల్పిస్తున్నాయి.
చిన్న లావాదేవీ నిర్వహించడం: KYC ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఖాతాను పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేయడానికి చిన్న మొత్తంలో డిపాజిట్ లేదా విత్‌డ్రా లావాదేవీ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన గమనిక: RBI నిబంధనల ప్రకారం, క్రియారహితంగా ఉన్న బ్యాంక్ ఖాతాను తిరిగి సక్రియం (Reactivate) చేయడానికి బ్యాంకులు ఎలాంటి రుసుము (Charges) వసూలు చేయకూడదు. ఇది పూర్తిగా ఉచితం.
5. మీ ఖాతాను ఎల్లప్పుడూ యాక్టివేట్ ఉంచుకోవడానికి చిట్కాలు
క్రమం తప్పకుండా వాడటం: మీ వద్ద ఉన్న అన్ని ఖాతాల నుంచి కనీసం సంవత్సరానికి ఒకట్రెండు సార్లు అయినా చిన్నపాటి డిజిటల్ లావాదేవీలు లేదా ATM విత్‌డ్రాలు చేయండి.
అవసరం లేని ఖాతాలను మూసివేయడం: మీరు ఉపయోగించని ఖాతాలు ఉంటే, వాటిని ఉంచడం కంటే బ్యాంక్‌కు వెళ్లి క్లోజ్ చేయడం మంచిది.
వివరాలు అప్‌డేట్ చేయడం: మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, లేదా నివాస చిరునామా మారినప్పుడు వెంటనే బ్యాంక్‌లో అప్‌డేట్ చేయండి. తద్వారా ఖాతా ఇన్-ఆపరేటివ్‌గా మారే ముందు బ్యాంక్ పంపే అలర్టులు మీకు అందుతాయి.