LPG Gas Price: కొత్త సంవత్సరానికి ముందు గుడ్‌న్యూస్‌.. తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర

సామాన్య ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరను 39 రూపాయలకు తగ్గించిన తర్వాత వాణిజ్య సిలిండర్ ఢిల్లీలో రూ.1757.50, కోల్‌కతాలో రూ.1869, ముంబైలో రూ.1710, చెన్నైలో రూ.1929.50కి అందుబాటులో ఉంటుంది. క్రిస్‌మస్, న్యూ ఇయర్ వేడుకలకు ముందే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ భారీ డిస్కౌంట్లు ఇచ్చింది.

LPG Gas Price: కొత్త సంవత్సరానికి ముందు గుడ్‌న్యూస్‌.. తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర
Lpg Gas Price

Updated on: Dec 23, 2023 | 6:25 AM

నూతన సంవత్సరానికి ముందు సామాన్య ప్రజలకు ఓ పెద్ద కానుక అందింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.39 తగ్గాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధరను తగ్గించింది. ఇది సామాన్య ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరను 39 రూపాయలకు తగ్గించిన తర్వాత వాణిజ్య సిలిండర్ ఢిల్లీలో రూ.1757.50, కోల్‌కతాలో రూ.1869, ముంబైలో రూ.1710, చెన్నైలో రూ.1929.50కి అందుబాటులో ఉంటుంది. క్రిస్‌మస్, న్యూ ఇయర్ వేడుకలకు ముందే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ భారీ డిస్కౌంట్లు ఇచ్చింది.

డొమెస్టిక్ సిలిండర్ ధర మారిందా?

ఇవి కూడా చదవండి

అయితే దేశీయ LPG సిలిండర్ గురించి మాట్లాడినట్లయితే దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలు ఆగస్టు నుంచి స్థిరంగా ఉన్నాయి. దాని రేటులో ఎటువంటి మార్పు లేదు. చివరిసారిగా ఆగస్టు 30, 2023న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.200 తగ్గింది. IOCL వెబ్‌సైట్ ప్రకారం.. దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50.

ఇంతకుముందు డిసెంబర్ 1న ధరలు మారాయి

అంతకుముందు డిసెంబర్ 1న 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరను మార్చాయి. అప్పుడు సిలిండర్ ధర రూ.21 పెరిగింది. కాగా, అంతకు ముందు నవంబర్ 16న కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.57 తగ్గింది. గత కొంతకాలంగా వాణిజ్య LPG సిలిండర్ల ధరలో దాదాపు ప్రతి నెలా మార్పులు కనిపిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us