2016లో నోట్ల రద్దు తర్వాత భారతదేశంలో డిజిటల్ పేమెంట్లు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ఎన్‌పీసీఐ లాంచ్ చేసిన యూపీఐ సర్వీసులు ఎక్కువ ప్రజాధరణ పొందాయి. అయితే యూపీఐ లావాదేవీలు చేయడానికి రోజుకు రూ.లక్ష పరమితి ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల యూపీఐ లావాదేవీల పరిమితులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలలు వంటి విద్యా సౌకర్యాల వంటి ఆరోగ్య సంరక్షణ విభాగాలకు చెల్లింపుల కోసం యూపీఐ పరిమితిని ప్రస్తుత రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ఆర్‌బీఐ గవర్నర్ పునరావృత చెల్లింపుల కోసం ఈ ఆదేశాలకను ప్రకటించారు. ఆర్‌బీఐ తాజా నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆర్‌బీఐ తాజా చర్యలు విద్య, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల కోసం అధిక మొత్తంలో యూపీఐ చెల్లింపులు చేయడానికి వినియోగదారులకు సహాయం చేస్తుంది. ఈ ఆదేశాల్లో నిర్ణయంలో భాగంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా, క్రెడిట్ కార్డ్ రీపేమెంట్‌ల కోసం అదనపు ఫ్యాక్టర్ అథెంటికేషన్ పరిమితిని రూ. 1 లక్షకు పెంచాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఇప్పటి వరకు రూ. 15,000 కంటే ఎక్కువ చెల్లింపులకు ఏఎఫ్‌ఏ అవసరం. ఆటో రీపేమెంట్ చేసేవారికి తాజా ఆదేశాలు బాగా ఉపయోగపడతాయి. ఈ చర్య ఆటో రీమెంట్ వినియోగాన్ని మరింత వేగవంతం చేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు
అలాగే ఫిన్‌టెక్ పర్యావరణ వ్యవస్థలో అభివృద్ధిని బాగా అర్థం చేసుకోవడానికి, అలాగే ఆ రంగానికి మద్దతు ఇవ్వడానికి ఫిన్‌టెక్ రిపోజిటరీ ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఇది ఏప్రిల్ 2024లో లేదా అంతకు ముందు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ద్వారా అమలు చేస్తామని వివరించింది. ఈ రిపోజిటరీకి సంబంధిత సమాచారాన్ని స్వచ్ఛందంగా ఫిన్‌టెక్‌లు అందించాల్సి ఉంటుంది. భారతదేశంలోని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వంటి ఆర్థిక సంస్థలు ఫిన్‌టెక్‌లతో ఎక్కువగా భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. భారతదేశంలో ఆర్థిక రంగానికి క్లౌడ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి సెంట్రల్ బ్యాంక్ కృషి చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న డేటా పరిమాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇందుకోసం చాలా మంది క్లౌడ్ సౌకర్యాలను ఉపయోగిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ ప్రయోజనం కోసం భారతదేశంలో ఆర్థిక రంగానికి క్లౌడ్ సదుపాయాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తోంది. ఇది మెరుగైన స్కేలబిలిటీ, వ్యాపార కొనసాగింపును కూడా సులభతరం చేస్తుంది. క్లౌడ్ సదుపాయాన్ని మధ్యకాలానికి క్రమాంకనం చేసిన పద్ధతిలో రూపొందించాలని ఉద్దేశించి రూపొందించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..