Fixed Deposits: ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక ఎఫ్‌డీల కాలపరిమితి పెంపు

|

Jul 20, 2024 | 4:45 PM

భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే నమ్మకమైన పథకాలుగా ఆదరణ పొందాయి. ఎలాంటి రిస్క్ లేకుండా నిర్ణీత ఆదాయంతో ఎఫ్‌డీలు మెచ్యూర్ అవ్వడంతో ఎక్కువ మంది ప్రజలు ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులతో పాలు స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంకులు ఎఫ్‌డీల వ్యాపారం పెంచుకునేందుకు ప్రత్యేక పథకాల ద్వారా ఎఫ్‌డీలకు అధిక వడ్డీనిస్తున్నాయి.

Fixed Deposits: ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక ఎఫ్‌డీల కాలపరిమితి పెంపు
Fixed Deposit
Follow us on

భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే నమ్మకమైన పథకాలుగా ఆదరణ పొందాయి. ఎలాంటి రిస్క్ లేకుండా నిర్ణీత ఆదాయంతో ఎఫ్‌డీలు మెచ్యూర్ అవ్వడంతో ఎక్కువ మంది ప్రజలు ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులతో పాలు స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంకులు ఎఫ్‌డీల వ్యాపారం పెంచుకునేందుకు ప్రత్యేక పథకాల ద్వారా ఎఫ్‌డీలకు అధిక వడ్డీనిస్తున్నాయి. ఎస్‌బీఐ, ఐడీబీబ్యాంక్ , ఇండియన్ బ్యాంక్, పంజాబ్ & సింధ్‌తో సహా అనేక పెద్ద బ్యాంకులు అధిక వడ్డీ రేట్లతో పరిమిత కాల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను అందిస్తున్నాయి. అయితే పెట్టుబడిదారులు గడువుకు ముందే పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏయే బ్యాంకులు ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను అందిస్తున్నాయో? ఓ సారి చూద్దాం. 

ఐడీబీఐ ప్రత్యేక ఎఫ్‌డీ 

ఐడీబీఐ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్‌డీ గడువు తేదీని జూన్ 30, 2024 నుండి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఐడీబీఐ బ్యాంక్ 300 రోజులు, 375 రోజులు, 444 రోజుల ప్రత్యేక బకెట్ పదవీకాల కోసం ఉత్సవ్ ఎఫ్‌డీచెల్లుబాటు తేదీని పొడిగించింది. అలాగే 700 రోజులతో కొత్తగా మరో ఎఫ్‌డీ పథకాన్ని తీసుకొచ్చింది. 300 రోజులలో మెచ్యూర్ అయ్యే ఉత్సవ్ ఎఫ్‌డీలపై బ్యాంక్ 7.05 శాతం వడ్డీ అందిస్తుంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లు 300 రోజుల ఉత్సవ్ ఎఫ్‌డీలపై 7.55 శాతం వడ్డీ పొందవచ్చు. 375 రోజులలో మెచ్యూర్ అయ్యే ఉత్సవ్ ఎఫ్‌డీల కోసం,  బ్యాంక్ 7.15 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు 375 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఉత్సవ్ ఎఫ్‌డీల కోసం 7.65 శాతం వడ్డీను పొందవచ్చు. 

ఇండియన్ బ్యాంక్ 

ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2024 వరకు పొడిగించింది. ఐఎన్‌డీ సూపర్ 400 డేస్  పథకంలో భాగాంగా 400 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే ఐఎన్‌డీ 300 డేస్‌లో భాగంగా సాధారణ ప్రజలకు 7.05 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.80% వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

పంజాబ్ అండ్ సింధ్  బ్యాంక్

పంజాబ్ అండ్ సింధ్ పరిమిత-కాల ప్రత్యేక డిపాజిట్ల ఆఫర్‌ను జూన్ 30, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు పొడిగించబడ్డాయి. 222 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ వ్యవధి 6.30 శాతం అధిక వడ్డీ రేటును అందిస్తుంది. 333 రోజుల వ్యవధితో ప్రత్యేక డిపాజిట్లపై బ్యాంక్ 7.15 శాతం అందిస్తుంది.

ఎస్‌బీఐ ప్రత్యేక ఎఫ్‌డీ అమృత్ కలాష్, వీకేర్

ఎస్‌బీఐ కస్టమర్‌లు సెప్టెంబరు 30, 2024 వరకు అమృత్ కలాష్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్‌బీఐ వీ కేర్‌లో పెట్టుబడి ఈ పథకంలో కూడా సెప్టెంబరు 30, 2024 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్లు, మెచ్యూరింగ్ డిపాజిట్ల పునరుద్ధరణపై ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం పబ్లిక్ కోసం కార్డ్ రేటు కంటే 50 బీపీఎస్ అందిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి