బంగారంలాంటి లాభాలు ఇచ్చే హోమ్ బిజినెస్ ప్లాన్..ఇంట్లో నుంచే నెలనెలా భారీ ఆదాయం!

మీరు మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఇదిగో ఒక మంచి ఆలోచన మీ కోసమే.. ఇందులో మీరు ప్రతి నెలా మంచి లాభం పొందవచ్చు. అది మరేంటో కాదు.. అరుదైన చేపలపెంపకం. దీంతో మీ చేతులకు మురికి లేకుండా ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించడానికి సులువైన మార్గం ఇది.. అదేలాగో ఇక్కడ చూద్దాం...

బంగారంలాంటి లాభాలు ఇచ్చే హోమ్ బిజినెస్ ప్లాన్..ఇంట్లో నుంచే నెలనెలా భారీ ఆదాయం!
Gold Fish Business Idea

Updated on: Jan 26, 2026 | 3:00 PM

ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపారం ప్రారంభించి, తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. కానీ, ఏం వ్యాపారం చేయాలి..? ఎలా మొదలు పెట్టాలో వారికి తెలియదు. వేసవి సమీపిస్తున్న కొద్దీ, కొన్ని వ్యాపారాలు నష్టాలను మిగులుస్తాయి. అటువంటి సమయంలో మీరు మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఇదిగో ఒక మంచి ఆలోచన మీ కోసమే.. ఇందులో మీరు ప్రతి నెలా మంచి లాభం పొందవచ్చు. అది మరేంటో కాదు.. అరుదైన చేపలపెంపకం. దీంతో మీ చేతులకు మురికి లేకుండా ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించడానికి సులువైన మార్గం ఇది.. అదేలాగో ఇక్కడ చూద్దాం…

ఇంట్లో అక్వేరియంలను పెట్టుకోవాలని, వాటిని అందంగా అలంకరించడం అందరికీ ఇష్టమే. అలాంటి వారికి మరింత ప్రియమైనవి గోల్డ్‌ ఫిష్‌. అక్వేరియంలలో గోల్డ్ ఫిష్‌లను ఉంచడం వల్ల మీ ఇంటికి మరింత అందాన్ని తెస్తాయి. ఈ గోల్డ్ ఫిష్‌ల నుండి డబ్బు సంపాదించడం చాలా ఈజీ. భారతదేశంలో ఇప్పటికే చాలా మంది ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఎందుకంటే గోల్డ్ ఫిష్‌తో సహా మార్కెట్లో అమ్మే చేపల ధర ఎక్కువగా ఉంటుంది.

ఇంట్లో చేపల పెంపకం ద్వారా డబ్బు సంపాదించాలనుకునే ఎవరికైనా లక్ష నుంచి 2.50 లక్షల రూపాయలు అవసరం అవుతుంది. ఈ డబ్బులో 50 వేల రూపాయలు 100 అడుగుల అక్వేరియం కొనడానికి ఖర్చు చేస్తారు. మరో 50 వేల రూపాయలు చేపల పెంపకానికి అవసరమైన సామాగ్రిని కొనడానికి ఖర్చు చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇవన్నీ కొన్న తర్వాత, ఆడ, మగ చేపల మధ్య 4:1 నిష్పత్తిలో కొనండి. అంటే, మీరు నాలుగు ఆడ చేపలు కొంటే, ఒక మగ చేప ఉండాలి. ఈ విధంగా కొనుగోలు చేసిన చేపలను అక్వేరియంలో ఉంచితే, అవి 4 నుండి 6 నెలల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. దేశంలో చాలా మంది ఈ నమూనాను అనుసరిస్తున్నారు. సంవత్సరానికి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.

గోల్డ్ ఫిష్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి, మీరు మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. గోల్డ్ ఫిష్ పరిమాణం, ఆకారం, నాణ్యత ఆధారంగా ధర నిర్ణయించబడుతుంది. ప్రతి గోల్డ్ ఫిష్ ను రూ. 100 నుండి రూ. 1,000 వరకు అమ్మవచ్చు. మీరు నెలకు నాలుగు లేదా ఐదు సార్లు ఒకేసారి 50 నుండి 100 చేపలను అమ్మితే, మీరు ఖచ్చితంగా లాభం పొందుతారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..