Gold Rate Today: పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన బంగారం ధర.. ఏప్రిల్ 7వ తేదీ గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయో తెలిస్తే..

గత ఏడాది కాలంగా పసిడి ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డు ధరతో పోలిస్తే సుమారు రూ.35,000- రూ.40,000వరకు తక్కువగా ట్రేడ్ అవుతుండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పుల వల్ల ధరల్లో ఈ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

Gold Rate Today: పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన బంగారం ధర.. ఏప్రిల్ 7వ తేదీ గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయో తెలిస్తే..
Gold

Updated on: Apr 07, 2026 | 6:56 AM

ఏప్రిల్ 7, 2026 నాటికి బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు గరిష్టాల నుండి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ప్రియులకు ఇది కొంత ఊరటనిచ్చే విషయంగా చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పెరగడం వల్ల బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు తగ్గుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు బంగారం ధరలపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాగే పెళ్లిళ్ల సీజన్ ముగియడం లేదా డిమాండ్ తగ్గడం వల్ల కూడా మార్కెట్లో ధరలు నియంత్రణలో ఉంటున్నాయి.

నేడు ఏప్రిల్ 7వ తేదీన బంగారం ధరలు మార్కెట్‌లో స్వల్ప తగ్గుదలతో కొనసాగుతున్నాయి. గత ఏడాది కాలంగా పసిడి ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డు ధరతో పోలిస్తే సుమారు రూ.35,000- రూ.40,000వరకు తక్కువగా ట్రేడ్ అవుతుండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పుల వల్ల ధరల్లో ఈ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో, ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు.

నేటి బంగారం ధరల వివరాలు (indicative):
హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా ఉన్నాయి:

చెన్నైలో బంగారం ధర 24 క్యారెట్లు రూ.1,52,630, 22క్యారెట్లు రూ.1,39,910గా ఉంది.

ముంబైలో బంగారం ధర 24క్యారెట్లు రూ.1,50,650 , రూ.1,38,090గా ఉంది.

ఢిల్లీలో బంగారం ధర 24క్యారెట్లు రూ.1,50,800, 22 క్యారెట్లు రూ.1,38,240లుగా ఉంది.

కోల్‌కతాలో బంగారం ధర 24క్యారెట్లు రూ.1,50,650, 22 క్యారెట్లు రూ.1,38,090గా ఉంది.

బెంగళూరులో బంగారం ధర 24క్యారెట్లు రూ.1,50,650, 22క్యారెట్లు రూ.1,38,090గా ఉంది.

హైదరాబాద్‌లో బంగారం ధర 24క్యారెట్లు రూ.1,50,650, 22 క్యారెట్లు రూ.1,38,090గా ఉంది.

అటు, విజయవాడ, విశాఖపట్టణంలో బంగారం ధర 24క్యారెట్లు రూ.1,49,120, 22 క్యారెట్లు రూ.1,36,690గా ఉంది.

ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 2,60,100.లుగా ఉంది.

ఉదయం 7గంటల లోపు అందిన సమాచారం మేరకు మాత్రమే ఈ వివరాలు అందించబడ్డాయి. మార్కెట్ ప్రారంభం తర్వాత ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.  ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us