Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తున్నాయి. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. కాగా.. తాజాగా శనివారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. అయితే.. 22 క్యారెట్ల తులం బంగారంపై (Gold Price) రూ.400 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.440 మేర తగ్గింది. కాగా.. వెండి ధరలు కూడా రూ.1000 మేర తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ. 65,000 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా (Gold, silver prices today) ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,260 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,110, చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,010, 24 క్యారెట్ల ధర రూ.52,370 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,110 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,110 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,110 గా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.65,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.65,000 ఉంది. బెంగళూరులో రూ.70,000, కేరళలో రూ.70,000 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.70,000, విజయవాడలో రూ.70,000, విశాఖపట్నంలో రూ.70,000 లుగా కొనసాగుతోంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: