
బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతున్నాయి.. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. గత కొన్ని రోజుల నుంచి మళ్లీ భారీగా పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. పది రోజుల్లోనే దాదాపు 4వేల వరకు ధరలు పెరిగాయి.. ప్రధానంగా.. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.. ఈ క్రమంలోనే, బుధవారం బంగారం ధరలు తగ్గాయి. 700ల వరకు బంగారం పై ధర తగ్గింది. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా గురువారం (ఆగస్టు 20) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 మేర తగ్గి.. రూ.1,54,960 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,42,040 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి రూ.2,44,900 లుగా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,54,960, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,54,960, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,42,040 ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,55,110, 22 క్యారెట్ల ధర రూ.1,42,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,960, 22 క్యారెట్ల ధర రూ.1,42,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,960, 22 క్యారెట్ల ధర రూ.1,42,040 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,54,960, 22 క్యారెట్ల ధర రూ.1,42,040 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.