Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం రేట్లు.. ఎంతంటే ?

మళ్లీ బంగారం పరుగులు పెడుతోంది. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు బుధవారం మళ్లీ పెరిగింది. నిన్నటితో

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం రేట్లు.. ఎంతంటే ?

Updated on: Jan 13, 2021 | 9:26 AM

మళ్లీ బంగారం పరుగులు పెడుతోంది. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు బుధవారం మళ్లీ పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర రూ.270 పెరిగింది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,580కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,580 ఉంది.

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి..
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,750కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,400కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.46,200కు ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 దగ్గర ఉంది. ఇక ముంబై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,580ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.51,050కు చేరింది.

Also Read: Gold Rates Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఇవాళ పలు నగరాల్లో బంగారం ఎంత రేటు ఉందంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us