AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: వామ్మో.. 10 రోజుల్లో రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధరలు.. ఒకేసారి ఎంతంతే..?

బంగారం ధరలు బ్రేకులు లేకుండా దూసుకెళ్తూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు అమాంతం పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. పది రోజుల్లో ఏకంగా భారీ స్థాయిలో పెరిగాయి. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఇదే స్థాయిలో పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Gold Prices: వామ్మో.. 10 రోజుల్లో రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధరలు.. ఒకేసారి ఎంతంతే..?
Gold
Venkatrao Lella
|

Updated on: Aug 24, 2026 | 5:28 PM

Share

బంగారం ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. అమెరికన్ డాలర్ రోజురోజుకి బలహీనపడటం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరోసారి రికార్డ్ స్థాయికి గోల్డ్ రేట్లు చేరుకోవచ్చనే అంచనాలు నిజమయ్యేలా ప్రస్తుత పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముందనే ప్రచారం ఊపందుకుంది. ఇదే జరిగితే ప్రభుత్వ బ్రాండ్లకు ఆకర్షణ తగ్గుతుంది. దీంతో బంగారంలో ఎక్కువమంది పెట్టుబడులు పెడుతుండటంతో.. వీటి ధరలు పుంజుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరగనున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. బంగారంలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటంతో.. డిమాండ్ దృష్ట్యా ధరలు పెరుగుతున్నాయి.

10 రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందంటే..?

గత 10 రోజుల్లో భారత్‌లో బంగారం ధర ఏకంగా రూ.10 వేలు పెరిగింది. దీంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. అసలే శ్రావణ మాసం స్టార్ట్ కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతుండగా.. ధరలు పెరగడంతో కొనుగోలుచేసేవారు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో మధ్యతరగతి ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఆగస్ట్ 15న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద ఉండగా.. ఆగస్ట్ 24 నాటికి రూ.1,63, 970 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల ధర ఆగస్ట్ 15న రూ.1,42,200 వద్ద ఉండగా.. ఆగస్ట్ 24న రూ.1,50,300గా ఉంది. యూఎస్ డాలర్ క్షీణిస్తుండటం, ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో బంగారం ధరలు ఎంసీఎక్స్‌లో భారీగా పెరుగుతున్నాయి. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో రూ.20 వేలకుపైగా పెరిగి షాకిచ్చింది. సోమవారం కిలో వెండి రూ.5 వేల పెరగ్గా.. రూ.2,75,000కి చేరుకుంది. గత నెలలో స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి ధరలు.. ఈ నెల చివరివారంలో భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి. త్వరలో రికార్డ్ స్థాయికి గోల్డ్ రేట్లు చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే బంగారం మరింత ఖరీదు కానుంది.

నేటి ధరలు ఇవే..

ఆగస్ట్ 24న హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,970 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,50,300గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల రేటు రూ.1,63,970 వద్ద ట్రేడవుతుండగా. 22 క్యారెట్ల ధర రూ.1,50,300గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,970 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,50,300 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,64,120 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,50,450గా ఉంది.

Follow Us