Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. తగ్గిన పసిడి ధరలు..!

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. నిన్న దిగి వచ్చిన బంగారం ధర.. ఈ రోజు కూడా దిగి వచ్చింది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది...

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. తగ్గిన పసిడి ధరలు..!

Updated on: Jan 08, 2022 | 6:18 AM

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. నిన్న దిగి వచ్చిన బంగారం ధర.. ఈ రోజు కూడా దిగి వచ్చింది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. బంగారం కొనుగోళ్లు ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. షాపుల్లో కొనుగోలుదారులతో సంతడి నెలకొంటుంది. దేశంలో బంగారం ధరల్లో ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో పెరిగితే.. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగానూ, స్థిరంగా ఉంటాయి. ఇక కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (జనవరి 8)న దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఒక వేళ తగ్గవచ్చు.. లేదా పెరగొచ్చు. తాజాగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,750 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,100 వద్ద ఉంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,510 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,510 వద్ద కొనసాగుతోంది.

* ఇక తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,940 ఉంది.

* ఇక పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450 వద్ద కొనసాగుతోంది.

* అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650 ఉంది.

* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,650 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

* ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,65 0 వద్ద కొనసాగుతోంది.

* అలాగే ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650 వద్ద కొనసాగుతోంది.

* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం మార్పులు చేర్పులు ఉంటాయి. బంగారం ధరలు పెరగడానికి, తగ్గడానికి అనేక రకాల కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

PPF Scheme: మీరు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? అదిరిపోయే ప్రయోజనం.. రోజుకు రూ.400లతో కోటి రూపాయల బెనిఫిట్‌..!

FASTag -Airtel Payments Bank: ఎయిర్‌టెల్‌ కొత్త సేవలు.. పార్కింగ్‌, కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల్లో ఫాస్టాగ్‌.. !

Loading...
Unable to load recommendations.
Follow Us