Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పెరిగిన పసిడి రేట్లు.. తాజా ధరల వివరాలు

|

Nov 04, 2021 | 5:25 AM

Gold Price Today: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పండగ సీజన్‌లో..

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పెరిగిన పసిడి రేట్లు.. తాజా ధరల వివరాలు
Gold
Follow us on

Gold Price Today: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పండగ సీజన్‌లో బంగారం ధరలు పరుగులు పెట్టి.. రెండు రోజులుగా స్థిరంగా కొనసాగింది. కానీ ఈ రోజు మాత్రం పసిడి కొనుగోలుదారులకు షాకిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా నవంబర్‌ 3న బుధవారం బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల ధరపై రూ.110 నుంచి రూ.200 వరకు పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా వద్ద కొనసాగుతోంది. తాజాగా బుధవారం దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరలు..
► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,200గా ఉంది.

► ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,080 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,180 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
►ఇక తెలుగు రాష్ట్రాల విషయానిస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870గా ఉంది.

►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,870గా ఉంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో చేరి ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు..!

Gold Carats: 24 క్యారెట్ల బంగారం.. 22 క్యారెట్ల బంగారానికి తేడా ఏమిటి..? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..!