Gold Rate Today: దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంతంటే..
Gold, Silver Rates Today: అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 1.4 శాతం తగ్గి ఔన్స్‌కు 4,592 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గతంలో ఇదే ధర 4,650 డాలర్లకు పైగా నమోదైంది. మంగళవారం బంగారం ధర మే 14 తర్వాత అత్యధిక స్థాయికి చేరింది..

Gold Rate Today: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నేడు, ఆగస్టు 27 గురువారం భారీగానే కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో తులం బంగారం ధర రూ.1.40 లక్షల వరకు వెళ్లి ప్రస్తుతం రూ.1.63,740 వరకు వెళ్లింది. ఈ వ్యత్యాసాన్ని చూస్తే ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో అర్థమైపోతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, డాలర్ బలపడటం, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
- ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,090 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర రూ.2,59,000గా నమోదైంది. వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు ప్రస్తుతం కొంత బ్రేక్ పడుతుందేమోనని భావిస్తున్న మహిళలకు నిరాశే ఎదురవుతోంది.
- హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,090 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,890, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,240 వద్ద కొనసాగుతోంది.
- ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,090 వద్ద కొనసాగుతోంది.
- ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,64,900 వద్ద కొనసాగుతుండగా, ఇతర ప్రాంతాల్లో రూ.2,59,900 వద్ద ట్రేడవుతోంది.
ఇది కూడా చదవండి: September Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..?
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి పతనం
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 1.4 శాతం తగ్గి ఔన్స్‌కు 4,592 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గతంలో ఇదే ధర 4,650 డాలర్లకు పైగా నమోదైంది. మంగళవారం బంగారం ధర మే 14 తర్వాత అత్యధిక స్థాయికి చేరింది. దీంతో ఇటీవలి ర్యాలీలో వచ్చిన లాభాలను అందుకోవడానికి కొంతమంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ప్రాఫిట్ బుకింగ్ కూడా పసిడి ధరల తగ్గుదలకు కారణమవుతోంది.
అమెరికా మార్కెట్లను పరిశీలిస్తే గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.9 శాతం తగ్గి 4,653 డాలర్ల వద్ద ముగిసింది. మరోవైపు అమెరికా డాలర్ విలువ 0.3 శాతం బలపడింది. సాధారణంగా డాలర్ బలపడితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై ఒత్తిడి పెరుగుతుంది. డాలర్‌తో కొనుగోలు చేసే పెట్టుబడిదారులకు పసిడి ఖరీదుగా మారడంతో డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. గమనిక: బంగారం, వెండి ధరలు నగరం, జువెల్లరీ, పన్నులు, మేకింగ్ ఛార్జీలను బట్టి మారవచ్చు.
ఇది కూడా చదవండి: BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ప్లాన్.. చౌకైన రీఛార్జ్‌తో 412 రోజుల వ్యాలిడిటీ..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




