AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: మళ్లీ ఎగబాకిన బంగారం ధరలు.. గంటల్లోనే తారుమారు.. సెప్టెంబర్ 16న రేట్లు ఇవే..

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతుండగా.. ఫెడ్ వడ్డీ రేట్లపై స్పష్టత ఇవ్వనున్న క్రమంలో ధరలు ఎగబాకుతున్నాయి. అంతేకాకుండా భారత్‌పై అమెరికా సుంకాలు, డాలర్ విలువ పుంజుకుంటున్న క్రమంలో ధరలు భారీగా పెరుగతున్నాయి. ప్రస్తుతం ధరలు చూస్తే..

Venkatrao Lella
|

Updated on: Sep 16, 2026 | 11:35 AM

Share
బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. భారత్‌పై అమెరికా సుంకాలు, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాల క్రమంలో పసిడి ధరలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. బుధవారం అర్థరాత్రి 12 గంటలకు ఫెడ్ నుంచి ప్రకటన రానున్న క్రమంలో గోల్డ్ రేట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు భారీగా పతనమయ్యే అవకాశముంది.  ఈ ప్రకటన క్రమంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,440కు లభిస్తోండగా.. బుధవారం ఒక్కరోజే రూ.270 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,40,650 వద్ద కొనసాగుతుండగా.. నేడు ఒక్కరోజే రూ.250 పెరుగుదలను నమోదు చేశాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి

2 / 5
చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,440 పలుకుతుండగా.. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,650 వద్ద ట్రేడవుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,440గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,650 వద్ద ట్రేడవుతోంది.

3 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,590 వద్ద కొనసాగుతుండగా.... ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,800 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక వెండి ధరలు చూస్తే భిన్నంగా ఉన్నాయి. సిల్వర్ ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో గత కొద్ది రోజులుగా పెద్దగా మార్పులు కనిపించడం లేదు.

4 / 5
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలోనూ ఇవే ధర కొనసాగుతోంది. బెంగళూరులో కిలో సిల్వర్ ధర రూ.2.45 లక్షల వద్ద ట్రేడవుతోంది..

5 / 5
Follow Us