
Gold, Silver Prices Today: బంగారం, వెండి కొనుగోలు చేసేవారు ఇది శుభవార్తే. ఎందుకంటే రోజు రోజుకు ధరలు పతనమవుతున్నాయి. ఒక్క రోజులోనే 2 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. నిన్న తులం బంగారం ధర రూ.1,44,610 ఉండగా, ఇప్పుడు రూ.1,42,680కు దిగి వచ్చింది. గతంలో ఉన్న ధరలతో పోల్చుకుంటే ప్రస్తుతం నమదయ్యే ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ప్రస్తుతం నవంబర్ 11వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,680 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,790 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రతి రోజు ఉదయం 10 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు అప్‌డేట్ అవుతుంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,680 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,30,790 వద్ద ట్రేడవుతోంది.
ఇక వెండి విషయానికొస్తే.. ఇది కూడా గతంలో పరుగులు పెట్టగా, ఇప్పుడు క్రమంగా పతనమవుతోంది. తాజాగా కిలో వెండి ధర రూ.2,04,900 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయంగా బంగారం ధరలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అంతర్జాతీయంగా కమోడిటీ మార్కెట్లలో (COMEX) స్పాట్ గోల్డ్ ఔన్సు ధర $4,000 పైనే స్థిరపడటం, డాలర్ సూచీలో వచ్చే మార్పుల వల్ల పసిడి ధరలలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరిగిన ధరల అనంతరం లాభాల స్వీకరణ (Profit booking) కారణంగా గత వారంతో పోలిస్తే ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
24 క్యారెట్లలో 99.9 స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. ఇది అత్యంత మెత్తగా, నాణ్యంగా ఉంటుంది. రంగు క ఊడా గాఢమైన పసుపు రంగులో ఉంటుంది. ఇది 22 క్యారెట్లకంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా నాణేలు, బిస్కెట్లు, గోల్డ్ బార్లకు ఉపయోగిస్తారు.
ఇక 22 క్యారెట్ల బంగారంలో 91.9 శాతం బంగారం, మిగతా 8.4 శాతం రాగి, వెండి వంటి లోహాలు కలుస్తాయి. ఇది దృఢంగా, గట్టిగా ఉంటుంది. స్వల్పంగా తేలికపాటి పసుపు రంగు, ఇది 24 క్యారెట్లకంటే తక్కువగా ఉంటుంది. ఇది రోజువారి సాంప్రదాయ అభరణాలకు ఉపయోగకరంగా ఉంటుంది.