బంగారం కొనాలని చూస్తున్నారా.? కాస్త ఆగండి.! తగ్గినట్టే తగ్గినా గోల్డ్ రేట్స్.. మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన రెండు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 280 మేరకు పెరిగింది. గ్లోబల్ మార్కెట్లో నెగటివ్ సిగ్నల్స్, అంతర్జాతీయంగా గోల్డ్ నిల్వలు, ఫెడ్ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం లాంటి అంశాలు ఈ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులను చూపిస్తున్నాయి. మరి ఈ తరుణంలో దేశంలోని వివిధ నగరాల్లో నమోదైన బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,670కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,210గా ఉంది. ఇక హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ముంబై, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,060గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 77,520గా కొనసాగుతోంది.
బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతుంటే.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. గడిచిన నాలుగు రోజుల్లో సుమారు రూ. 2600 మేరకు తగ్గాయి వెండి ధరలు. నిన్న స్థిరంగా కొనసాగిన వెండి ధర.. ఇవాళ రూ. 100 మేరకు తగ్గింది. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబైలో కిలో వెండి రూ. 89,400గా ఉంది. అలాగే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి రూ. 97,800 కాగా, కేరళ, చెన్నైలో కిలో వెండి రూ. 97,900గా కొనసాగుతోంది.
కాగా, ఈ ధరలు గురువారం ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కొనే ముందు ఒకసారి ధరలు చెక్ చేసుకోవడం బెటర్. ఇక లేటెస్ట్ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి