Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ గోల్డ్ రేట్స్..

|

Jun 09, 2021 | 6:03 AM

Gold Price Today: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ మాత్రం పరుగులు పెట్టాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ గోల్డ్ రేట్స్..
Gold Price Today
Follow us on

Gold Price Today: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ మాత్రం పరుగులు పెట్టాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కరోనా రెండో దశ దేశాన్ని అల్లాడిస్తున్న బంగారం ధరలు మాత్రం ఆకాశన్నంటుతున్నాయి. అటు నిత్యావసర సరుకుల ధరలు, ఇటు బంగారం ధరలు వరుసగా దూసుకెళ్తున్నాయి. రోజు రోజూకీ బంగారం ధరలు భారీగానే పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. బుధవారం (జూన్ 9న) దేశీయ మార్కెట్లో బంగారం ధర పైకి ఎగిసింది. దీంతో ప్రధాన నగరాల్లో పసిడి ధరలో మార్పులు జరిగి రూ.50వేలకు చేరువలో నిలిచింది.

దేశీయ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,680 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,680గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,050 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420గా ఉంది. అలాగే ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,680 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,680గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,300గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,500గా ఉంది. ఇకపోతే… బెంగుళూరులోని మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,900గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,070గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,900గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50.070గా ఉంది. అలాగే విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల బంగారం ధర రూ. 45,900గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,070గా ఉంది.

Also Read: Samantha Akkineni: యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌కి బెట‌ర్ ఆప్ష‌న్‌గా స‌మంత‌.. ఆకాశానికెత్తేస్తున్నారు బాలీవుడ్ క్రిటిక్స్

RRR Movie: మెగానందమూరి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ కోసం నెక్స్ట్ ఇయర్ వరకూ ఎదురు చూడాలట..!