Gold Price: బంగారం ధగధగలు.. ధరల్లో భగభగలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా..

|

Nov 30, 2023 | 6:21 AM

బంగారు ఆభరణాలే కాకుండా గోల్డ్ బిస్కెట్ రూపంలో కూడా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడతారు. ఈ మధ్యకాలంలో సావరిన్ గోల్డ్ బాండ్ పేరుతో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నారు. అయితే బంగారం ధర రోజుకో విధంగా మారుతూ వస్తోంది. నిన్న స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈరోజు అమాంతం పెరిగిపోయింది.

Gold Price: బంగారం ధగధగలు.. ధరల్లో భగభగలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా..
Gold Price Today
Follow us on

బంగారు ఆభరణాలే కాకుండా గోల్డ్ బిస్కెట్ రూపంలో కూడా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడతారు. ఈ మధ్యకాలంలో సావరిన్ గోల్డ్ బాండ్ పేరుతో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నారు. అయితే బంగారం ధర రోజుకో విధంగా మారుతూ వస్తోంది. నిన్న స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈరోజు అమాంతం పెరిగిపోయింది. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ హెచ్చుతగ్గులు, పలు దేశాల్లో యుద్ద పరిస్థితులు, ముడి చమురు ధరల్లో మార్పులు అన్నీ కలిపి బంగారు ధరలు పెరుగుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.62,560 కాగా ఈరోజు ఏకంగా తులంపై రూ.820 పెరిగి రూ. 63,380కి చేరింది . ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,350 ఉండగా ఈరోజు రూ. 750 పెరిగి 58,100కు చేరింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 81,500 కాగా ఈరోజు కిలోపై 700 పెరిగి 82,200కు చేరింది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

హైదరాబాద్..రూ. 63,380
విజయవాడ..రూ. 63,380
ముంబాయి..రూ. 63,380
బెంగళూరు..రూ.63,380
చెన్నై..రూ. 64,040

ఇవి కూడా చదవండి

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

హైదరాబాద్..రూ. 58,100
విజయవాడ..రూ. 58,100
ముంబాయి..రూ. 58,100
బెంగళూరు..రూ. 58,100
చెన్నై..రూ.58,700

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

హైదరాబాద్..రూ. 82,200
విజయవాడ..రూ. 82,200
చెన్నై..రూ.82,200
ముంబాయి..రూ. 79,200
బెంగళూరు..రూ. 78,000

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..