AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..

బంగారం ధర గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరింది. బంగారంతోపాటు వెండి ధర కూడా భగ్గుమంటోంది. అయితే.. షేర్‌‌ మార్కెట్‌ నుంచి బులియన్‌ మార్కెట్‌కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు రూపాయి బలహీనపడడం వల్ల దిగుమతి ధరపై ప్రభావం చూపిస్తోంది.

Gold Rates: బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..
Gold Rates
Shaik Madar Saheb
|

Updated on: Sep 08, 2025 | 11:58 AM

Share

బంగారం ధర గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరింది. బంగారంతోపాటు వెండి ధర కూడా భగ్గుమంటోంది. అయితే.. షేర్‌‌ మార్కెట్‌ నుంచి బులియన్‌ మార్కెట్‌కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు రూపాయి బలహీనపడడం వల్ల దిగుమతి ధరపై ప్రభావం చూపిస్తోంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ ఓవైపు.. బంగారం ధర ఇంకా పెరుగుతుందన్న వదంతుల వల్ల డిమాండ్‌ అమాంతం పెరిగిపోయి ధరలు భగ్గుమంటున్నాయి. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు చేర్పులు జరుగుతుంటాయి.. ఈ క్రమంలోనే.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం, వెండికి సోమవారం బ్రేకులు పడ్డాయి.. సెప్టెంబర్ 8 2025న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. తాజాగా నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి..

24క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర లక్షా, 8వేల 350 రూపాయలకు చేరింది. పది గ్రాములపై రూ.110 మేర ధర తగ్గింది.

22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.100 మేర తగ్గి.. రూ.99,350 గా ఉంది.

వెండి కిలో ధర.. రూ.1000 మేర తగ్గి.. లక్షా 27వేల రూపాయలుగా ఉంది.

కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,380 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.99,350 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,37,000 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,380 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.99,350 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,37,000 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగార ధర 1,08,530, 22 క్యారెట్ల ధర రూ.99,500లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,27,000లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగార ధర 1,08,380, 22 క్యారెట్ల ధర రూ.99,350లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,27,000లుగా ఉంది.

చెన్నైలో 24క్యారెట్ల బంగారం ధర రూ.1,08,770 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.99,700గా ఉంది. వెండి కిలో ధర రూ.1,37,000 గా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!