
Gold and Silver Prices: గత వారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుదల ప్రారంభమైంది. అయితే, గత వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం బంగారం రేటు ఔన్సుకు $4,988.60కి చేరుకుంది. వెండి కూడా ఔన్సుకు $77.525 వద్ద ముగిసింది.
అయితే నిన్న MCXలో బంగారం ధర 1.16% పెరిగి పది గ్రాములకు రూ.1,57,249కి చేరుకుంది. వెండి ధరలు 2.93% పెరిగి కిలోగ్రాముకు రూ.2,57,210కి చేరుకున్నాయి. ప్రస్తుతం ధరలు పెరుగుతున్నప్పటికీ, ఈ ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పుడు చాలా ఎక్కువ పెరుగుదల నమోదైంది.
MCX ఎక్స్ఛేంజ్ (MCX)లో సాయంత్రం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. అయితే, ధరలు వాటి గరిష్ట స్థాయిల కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. వెండి ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ 2.6% పెరిగి కిలోకు రూ.2,56,561 వద్ద ట్రేడవుతున్నాయి. గోల్డ్ MCX ఫ్యూచర్స్ 10 గ్రాములకు 1.2% పెరిగి రూ.1,57,351 వద్ద ఉన్నాయి.
ఇక ప్రస్తుతం ఫిబ్రవరి 10వ తేదీన దేశీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,920 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,760 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర రూ.3,00100 వద్ద ట్రేడవుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. బంగారం, వెండిని కొనుగోలు చేసే సమయంలో ధరను తెలుసుకొని వెళ్లడం మంచిది. అయితే ఈ ధరలు నిన్నటి నుంచి నమోదైనవి మాత్రమే. ప్రతి రోజు ఉదయం 9-10 గంటల మధ్య తాజా రేట్లు మళ్లీ అప్‌డేట్ అవుతుంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి