AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

మహిళలకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి ఎంతో ఇష్టమైన గోల్డ్ రేట్స్ పెరిగాయి. బంగారం రేట్లు అంతర్జాతీయ మార్కెట్ ను బట్టి మారుతుంటాయి. అంతర్జాతీయంగా పెరిగితే మన దేశంలో పెరుగుతాయి.. అక్కడ తగ్గితే ఇక్కడా తగ్గుతాయి. ప్రస్తుతం బంగారం ఎంత రేట్ పెరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Gold Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
Krishna S
|

Updated on: Jul 11, 2025 | 12:49 PM

Share

బంగారం ధరలు భగభగమంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు షాకిస్తున్నాయి. ఓ రోజు తగ్గి.. మూడు రోజులు పెరుగుతున్నాయి. ఈ ధరలు ఇవాళ కూడా స్వల్పంగా పెరిగాయి.  శుక్రవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 98వేల500 రూపాయిల దగ్గర ట్రేడ్ అవుతుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90వేల200 రూపాయిల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1 లక్షా10వేలుగా ఉంది. ఇవాళ్టి ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 98,400గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 90వేల200 రూపాయిలుగా ఉంది. కిలో వెండి ధర 1లక్షా 20 వేల రూపాయిలుగా ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.98,320 ఉండగా,  22 క్యారెట్ల ధర రూ.90,140గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,170, 22 క్యారెట్ల ధర రూ.89,990గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,170, 22 క్యారెట్ల ధర రూ.89,990 గా ఉంది. బంగారం అంతర్జాతీయంగా డాలర్లలో ట్రేడవుతుంది. అందువల్ల డాలర్ విలువ పెరిగితే, ఇతర కరెన్సీతో పోలిస్తే బంగారం ధరలు మరింత ఖరీదవుతాయి.

ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు తగ్గితే మరుసటి రోజు స్వల్పంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్‌లో బంగారం ధరలు రాబోయే రోజుల్లో 99 వేల నుంచి లక్ష రూపాయల మధ్య స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొంత మంది నిపుణులు 95 నుంచి ఒక లక్ష రూపాయల మధ్య బంగారం ధరలు స్థిరపడవచ్చని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్