AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే పతనం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా డౌన్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు పడిపోతూ వస్తోన్నాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో ధరలు క్రాష్ అవుతున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచే ధరలు కుప్పకూలుతున్నాయి. శనివారం కూడా అదే బాట పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంత ఉందంటే..

Gold Prices: బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే పతనం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Oct 17, 2026 | 6:37 AM

Share

పండుగ వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా డౌన్ అవుతున్నాయి. గత కొంతకాలంగా ధరలు పడిపోతూ వస్తోండగా.. శనివారం కూడా అదే బాట పట్టాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దేశీయంగానూ అదే ప్రభావం కొనసాగింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతల వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పడుతోంది. దీంతో అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ అంచనాల క్రమంలో గోల్డ్ రేట్లు దిగొస్తున్నాయి. అక్టోబర్ 17వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

-దేశీయ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,430 వద్ద ప్రస్తుతం కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,140 వద్ద ట్రేడవుతోంది.

-హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,430 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,140గా కొనసాగుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,430గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,140 వద్ద కొనసాగుతోంది.

-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,47,430 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,140 వద్ద ట్రేడవుతోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,430 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,140గా ఉంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,580 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,290గా ఉంది.

వెండి ధరలు చూస్తే..

-దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,29,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ రేటు రూ.2.30 లక్షలుగా ఉంది.

-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2,39,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ రేటు రూ.2.40 లక్షలుగా ఉంది.

-చెన్నైలో కిలో వెండి ధర రూ.2,39,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.40 లక్షలుగా ఉంది.

-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,29,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.30 లక్షలుగా ఉంది.

Follow Us
పండుగ వేళ గోల్డ్ కొనేవారికి ఊరట.. ధరలు ఒక్కసారిగా ఢమాల్..
పండుగ వేళ గోల్డ్ కొనేవారికి ఊరట.. ధరలు ఒక్కసారిగా ఢమాల్..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
నవరాత్రుల ఏడో రోజు అమ్మవారి కాలరాత్రి రూపం.. పూజా విధానం..
నవరాత్రుల ఏడో రోజు అమ్మవారి కాలరాత్రి రూపం.. పూజా విధానం..
కిక్ సినిమాలో నటించిన ఈ భామ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా
కిక్ సినిమాలో నటించిన ఈ భామ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా
రెండు మూడు సినిమాలతో కనిపించకుండా మాయం అయ్యింది..
రెండు మూడు సినిమాలతో కనిపించకుండా మాయం అయ్యింది..
అప్పట్లో ఊపేసింది.. ఇప్పుడు కనిపించకుండా మాయం అయ్యింది
అప్పట్లో ఊపేసింది.. ఇప్పుడు కనిపించకుండా మాయం అయ్యింది