Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి రిలీఫ్‌.. ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర. తులంపై ఎంతంటే.

|

Mar 21, 2023 | 6:25 AM

గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయినా బంగారం ధరలకు మంగళవారం బ్రేక్‌ పడింది. బ్రేక్‌ పడడమే కాదు భారీగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఒక్కరోజే తులంపై ఏకంగా రూ. 500 తగ్గడం విశేషం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో..

Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి రిలీఫ్‌.. ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర. తులంపై ఎంతంటే.
Gold Price Today
Follow us on

గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయినా బంగారం ధరలకు మంగళవారం బ్రేక్‌ పడింది. బ్రేక్‌ పడడమే కాదు భారీగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఒక్కరోజే తులంపై ఏకంగా రూ. 500 తగ్గడం విశేషం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదుల కనిపించింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

* దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 54,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,930 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 వద్ద నమోదైంది.

ఇవి కూడా చదవండి

* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.54,800 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.59,780 వద్ద ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,830 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,780 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,780 వద్ద కొనసాగుతోంది.

* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,780 ఉంది.

వెండి ధర ఎలా ఉందంటే..

బంగారం ధరతో పాటు వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. మంగళవారం దేశంలో కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. ఈరోజు చెన్నైలో కిలో వెండి ధర రూ.74,600, ముంబైలో రూ.72,000, ఢిల్లీలో రూ. 72,000, కోల్‌కతాలో కిలో వెండి రూ. 72,000 బెంగళూరులో రూ.74,600, హైదరాబాద్‌లో రూ.74,600, విశాఖ, విజయవాడలో రూ.74,600 వద్ద ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..