Income Tax Rules: బ్రతికుండగానే పిల్లలకు ఆస్తులు రాసిస్తున్నారా..? ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు..

ఆస్తుల పంపకాల్లో తరచుగా అన్నాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు మధ్య తరచుగా వివాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం తల్లిదండ్రులు బ్రతికుండగానే ఆస్తులు పంపిణీ చేయకపోవడం. ఇలాంటి వివాదాలు రాకుండా ఉండేందుకు కొంతమంది ముందుగానే ఆస్తులను పంపకాలు చేస్తూ ఉంటారు. రెండు మార్గాల్లో పంపకాలు చేయవచ్చు.

Income Tax Rules: బ్రతికుండగానే పిల్లలకు ఆస్తులు రాసిస్తున్నారా..? ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు..
Property

Updated on: Sep 07, 2026 | 2:56 PM

కొంతమంది బ్రతికుండగానే తమ వారసులకు ఆస్తులు రాసిస్తూ ఉంటారు. తాము మరణించాక వివాదాలు రాకూడనే ఉద్దేశంతో ముందుగానే ఆస్తులు పంపిణీ చేస్తూ ఉంటారు. ఆస్తులు తమ వారసులకు బదిలీ చేయడానికి తల్లిదండ్రులకు రెండు మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి గిఫ్ట్ డీడ్ ద్వారా అప్పగించడం లేదా వీలునామా ద్వారా రాసివ్వడం. గిఫ్ట్ డీడ్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పగించవచ్చు. అదే వీలునామా ద్వారా అయితే మరణాంతరం వారసులకు దక్కుతుంది. అయితే ఈ రెండిటిల్లో ఏది మంచిది? అనే అంశం ఇప్పుడు చూద్దాం.

గిఫ్ట్ డీడ్ వల్ల బెనిఫిట్స్ ఇవే..

భారత చట్టాల ప్రకారం కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులకు గిఫ్ట్ డీడ్ రూపంలో ఆస్తులు ఇవ్వవచ్చు. బహుమతిగా ఇచ్చే వస్తువులపై ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఎలాంటి పన్ను అప్పగించాల్సిన అవసరం లేదు. అయితే ఇది కేవలం కుటుంబసభ్యులు లేదా బాగా దగ్గరి బంధువులకు మాత్రమే వర్తిస్తుంది. ఇతరులకు ఇవ్వడానికి కుదరదు. ఇతరులకు ఇవ్వాలంటే పన్ను పరిధిలోకి వస్తాయి. అయితే గిఫ్ట్ డీడ్ ద్వారా ఇస్తే పన్ను ఉండదు కానీ.. స్టాంప్ డ్యూటీ మాత్రం వర్తిస్తుంది. అయితే వీలునామా ద్వారా వచ్చే ఆస్తులపై ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ రెండూ ఉండవు. వీలునామా ద్వారా వచ్చే ఆస్తులపై రెండు విధాలుగా బెనిఫిట్ ఉంటుంది. అయితే వీటి ద్వారా వారసులకు వచ్చే ఆదాయంపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్థిరాస్తులు బహుమతిగా అప్పగించాలంటే రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేయించుకోవాలి. ఒకసారి గిఫ్ట్ డీడ్ ద్వారా అప్పగిస్తే తల్లిదండ్రులకు ఆ ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదు. కానీ విలునామా ద్వారా అప్పగిస్తే జీవితాంతం నియంత్రణ ఉంటుంది. అయితే షరతులతో కూడిన గిఫ్ట్ డీల్ చేసుకుంటే తల్లిదండ్రుల నియంత్రణ కొనసాగుతోంది. అయితే బహుమతిగా ఇచ్చే నివాస, వ్యవసాయ భూములకు కొన్ని రాష్ట్రాలు రాయితీ స్టాంప్ డ్యూటీలు అందిస్తున్నాయి. ఇక వారసులు విదేశాల్లో ఉంటే విదేశీ మారక నిబంధనలు వర్తిస్తాయి.

ట్యాక్స్ పరిధిలోకి లేవు..

ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం.. వారసత్వంగా అప్పగించే ఆస్తులపై పన్ను ఉండదు. అలాగే కుటుంబసభ్యులు బహుమతిగా ఇచ్చే ఆస్తులు, వస్తువులు కూడా ట్యాక్స్ పరిధిలోకి రావు. అలాగే పెళ్లికి బంధువుల నుంచి అందుకునే వస్తువులకు కూడా పన్ను ఉండదు. ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ గురించి చాలామందికి అవగాహన లేక వీటి ప్రయోజనాలు అందుకోలేరు. అయితే బ్రతికుండగానే ఆస్తులు వారసులకు అప్పగించడం వల్ల భవిష్యత్తులో వారి మధ్య ఎలాంటి వివాదాలు ఉండవు.

Loading...
Unable to load recommendations.
Follow Us