కొద్ది రోజుల క్రితం వరకు, భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న గౌతమ్ అదానీకి గత కొన్ని రోజులుగా కష్టాలు ఎదురవుతున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక తెరపైకి వచ్చిన తర్వాత గౌతమ్ అదానీ నెట్‌వర్త్ వేగంగా తగ్గింది. అతని వ్యాపార సంస్థల షేర్లలో నిరంతర క్షీణత కనిపిస్తోంది. అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పిఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన తర్వాత కూడా భారీ ఎఫ్‌పిఓను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవలసి వచ్చిందో గౌతమ్ అదానీ స్వయంగా చెప్పారు.
20 వేల కోట్ల రూపాయల రికార్డు ఎఫ్‌పిఓ ఉపసంహరణకు సంబంధించి.. అదానీ వాటాదారులకు పంపిన సందేశంలో ఇలా తెలిపారు..” నాకు నా పెట్టుబడిదారులే మఖ్యం. మిగతావన్నీ రెండవ స్థానంలో ఉంటాయి. అందుకే ఇన్వెస్టర్లను మరింత నష్టాల నుంచి కాపాడేందుకు ఎఫ్‌పీఓకు స్వస్తి పలకాల్సి వచ్చింది. ఈ నిర్ణయం మా ప్రస్తుత కార్యకలాపాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపదని గౌతమ్ అదానీ సందేశంలో తెలిపారు. ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయడం మరియు డెలివరీ చేయడంపై మేము దృష్టి సారిస్తాం. ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసి ఉండవచ్చు, కానీ నిన్న మార్కెట్‌లో నెలకొన్న గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని, FPOతో ముందుకు వెళ్లడం నైతికంగా సరైనది కాదని బోర్డు భావించిందన్నారు.”
పెటుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎఫ్పీఓతో ముందుకు సాగకూడదని నిర్ణయించుకున్నామని పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తెలిపారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ బ్యాలెన్స్ షీట్ బలంగా ఉందని స్పష్టం చేశారు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో సంస్థకు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పారు.
మరోవైపు, అదానీ షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. హిండెన్‌బర్గ్ కథనాలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. 20వేల కోట్ల రూపాయల విలువైన ఫాలోఆన్ పబ్లిక్ ఆఫరింగ్ షేర్ల FPOను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. హిండెన్‌బర్గ్ అండ్ అదానీ గ్రూప్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోన్నవేళ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఈ నిర్ణయం తీసుకోవడం పెను సంచలంగా మారింది.
#WATCH | After a fully subscribed FPO, yday’s decision of its withdrawal would’ve surprised many. But considering volatility of market seen yday, board strongly felt that it wouldn’t be morally correct to proceed with FPO:Gautam Adani, Chairman, Adani Group
(Source: Adani Group) pic.twitter.com/wCfTSJTbbA
— ANI (@ANI) February 2, 2023
జనవరి 27న ప్రారంభమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPOకి ఆశించిన స్పందన రాలేదు. FPOకి చివరి రోజైన జనవరి 31వరకు 86శాతం షేర్లకు మాత్రమే బిడ్స్ వచ్చాయ్. హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPOపై దూరం ఉన్నారు రిటైల్ ఇన్వెస్టర్లు. రిటైలర్లకు 2.29కోట్ల షేర్లను రిజర్వ్ చేస్తే కేవలం 12శాతమే బిడ్స్ వచ్చాయ్. ఆఫర్ ధరకు 62 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినా ఆసక్తి చూపించలేదు రిటైలర్లు. అయితే, క్లోజింగ్ టైమ్‌లో పారిశ్రామికవేత్తల అండతో గట్టెక్కింది FPO
3వేల 276 రూపాయల ప్రైస్‌తో ఆఫర్ చేస్తే… 15శాతం దిగువన అంటే 2వేల 665 రూపాయిలకి పడిపోయింది షేర్ ధర. ఫస్ట్‌డే అయితే 3శాతం మాత్రమే సబ్‌స్క్రబ్ చేశారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని FPOను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది అదానీ ఎంటర్‌ప్రైజెస్.
అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్. హౌ ది వరల్డ్స్ థర్డ్ రిచెస్ట్ మ్యాన్ ఈజ్ పుల్లింగ్ – ది లార్జెస్ట్ కాన్ ఇన్ కార్పొరేట్ హిస్టరీ పేరుతో అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అప్పట్నుంచీ తీవ్ర నష్టాల్లోకి ట్రేడవుతున్నాయ్ అదానీ షేర్లు. వేలకోట్ల రూపాయలు నష్టపోయింది అదానీ గ్రూప్. హిండెన్‌బర్గ్ ఆరోపణలు ఇలా కొనసాగుతుండగానే… ఇప్పుడు FPOను రద్దు చేయడం సంచలనంగా మారింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం