
ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్‌ను యాక్సెస్ చేసుకోవాలంటే యూనివర్శల్ అకౌంట్ నెంబర్(UAN) చాలా అవసరం. యూఏఎన్ నెంబర్ లేకపోతే మీరు ఆన్‌లైన్‌లో మీ పీఎఫ్ అకౌంట్‌ను వాడలేరు. పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్, నగదు విత్ డ్రా, కేవైసీ, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ లాంటి తదితర సర్వీసులను పొందలేరు. యూఏఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకుంటేనే మీరు సర్వీసులు పొందగలరు.

ఒకవేళ మీరు యూఏఎన్ నెంబర్‌ను మార్చిపోతే సింగిల్ క్లిక్‌తో తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు హెచ్‌ఆర్‌ను అడగాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ నుంచే యూఏఎన్ నెంబర్ నిమిషాల్లోనే పొందవచ్చు. ఇందుకోసం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేవలను అందిస్తో్ంది. అదెలానో చూద్దాం.

యూపీఎఫ్‌వో యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌కు వెళ్లండి. హోమ్ పేజీలో కుడివైపున ముఖ్యమైన లింక్‌లు అని ఉండే ఆప్షన్ ఉంటుంది. అక్కడ దిగువున మీ యూఏఎన్ నెంబర్ తెలుసుకోండి అనే ట్యాబ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే కొత్త పేజీ తెరుచుకుంటుంది. మీ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి

ఆ తర్వాత క్యాప్చా కోడ్ నమోదు చేసి ఓటీపీని ధృవీకరించండి. ఆ తర్వాత నెక్ట్స్ పేజీలోకి వెళుతుంది. అక్కడ మీ పేరు, పుట్టిన తేదీ, ఆధార్ లేదా పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత షో మై యూఏఎన్ ఆనే ఆప్షన్‌పై ఎంటర్ చేయండి. అక్కడ మీ యూఏఎన్ నెంబర్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఇక ఇంటర్నెట్ లేకుండానే SMS పంపడం ద్వారా మీ UAN నంబర్‌ను తెలుసుకోవచ్చు. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు మెస్సేజ్ పంపండి. దీంతో మీకు టెక్ట్స్ మెస్సేజ్ రూపంలో మీ యూనివర్శల్ అకౌంట్ నెంబర్ వస్తుంది. ఇలా సెకన్లలోనే మీ నెంబర్ పొందవచ్చు