Flipkart: మీరు ఆర్డర్‌ను రద్దు చేస్తే ఫ్లిప్‌కార్ట్‌కు జరిమానా చెల్లించాలి! ఆ సంస్థ ఏం చెప్పింది?

|

Dec 15, 2024 | 5:26 PM

Flipkart: చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అలవాటు పడ్డారు. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో వివిధ ప్రోడక్ట్‌లను ఆర్డర్‌ చేస్తున్నారు. కొందరు వినిమోగదారులు ఆర్డర్‌ చేసిన తర్వాత రద్దు చేసుకుంటారు. మరి ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్‌ను రద్దు చేసుకుంటూ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరి ఎంత చెల్లించాలి? సంస్థ ఏం చెబుతోందో చూద్దాం..

Flipkart: మీరు ఆర్డర్‌ను రద్దు చేస్తే ఫ్లిప్‌కార్ట్‌కు జరిమానా చెల్లించాలి! ఆ సంస్థ ఏం చెప్పింది?
Follow us on

ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో మీరు ఆర్డర్‌ను రద్దు చేస్తే మీరు జరిమానా చెల్లించాలా? ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చాలా మంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో తమకు నచ్చకపోతే వస్తువును తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఇక నుంచి ఆన్‌లైన్ షాపింగ్‌కు క్యాన్సిలేషన్ ఫీజు (ఫ్లిప్‌కార్ట్) ప్రవేశపెట్టనుంది. అంటే, నిర్దిష్ట వ్యవధి తర్వాత ఆర్డర్ రద్దు చేసినట్లయితే దానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇక నుంచి రూ.20 వసూలు చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అసలు నిజాన్ని ఫ్లిప్‌కార్ట్ సంస్థ అందరికీ తెలియజేసింది.

ఇటీవల, ఎక్స్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ సంచలనం సృష్టించింది. ఇక్కడ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటి నుండి రూ. 20 రద్దు రుసుమును వసూలు చేసిందని పేర్కొంది. అయితే ఈ క్యాన్సిలేషన్ ఛార్జీ కొత్తదేమీ కాదని ఫ్లిప్‌కార్ట్ ఓ మీడియాకు స్పష్టం చేసింది. ఇది 2 సంవత్సరాల క్రితం నుండి అమలులో ఉంది. ఆర్డర్ చేసిన 24 గంటల తర్వాత ఆర్డర్‌ను రద్దు చేస్తే కస్టమర్‌కు రద్దు ఛార్జీ విధించబడుతుంది. మొదటి 24 గంటల్లో ఆర్డర్‌ను రద్దు చేసినందుకు ఎటువంటి ఛార్జీ ఉండదు.

కస్టమర్ ఆర్డర్ చేసిన 24 గంటల తర్వాత ఆర్డర్‌ను రద్దు చేస్తే, అతని నుండి రూ. 20 రద్దు రుసుము వసూలు చేస్తారు. ఎందుకంటే అమ్మకందారులు చాలా నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అందుకే విక్రేత, కస్టమర్ మధ్య మంచి సంబంధాన్ని కొనసాగించడానికి Flipkart ఇలా చేస్తుంది. ఏదైనా అనవసరమైన ఛార్జీలు లేదా రుసుములను నివారించడానికి ఆర్డర్‌ను రద్దు చేసే ముందు అన్ని నిబంధనలు, షరతులను చదవాలి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Aadhaar: ఆధార్‌ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. కేంద్రం మరోసారి గడువు పొడిగింపు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి