AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: నిమిషంలోనే యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.. మీ మొబైల్‌లోనే.. ప్రాసెస్ చాలా సింపుల్..

ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల యూఏఎన్ యాక్టివేషన్ ఫీచర్‌ను యూఏఎన్ పోర్టల్ నుంచి ఉమాంగ్ యాప్‌కు మార్చింది. ఇక నుంచి యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఉమాంగ్ యాప్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఈ సేవ అందుబాటులో ఉంది. మొబైల్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.

Venkatrao Lella
|

Updated on: Aug 24, 2026 | 7:16 PM

Share
ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవలు పొందాలంటే ముందుగా మీ యూనివర్శల్ అకౌంట్ నెంబర్(యూఏఎన్) యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, క్లెయిమ్ దాఖలు చేయడం, కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవడం, పీఎఫ్ అకౌంట్ ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేయడం లాంటి అన్నీ సేవలు పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకుంటే మీరు ఈపీఎఫ్‌ఓకు సంబంధించిన ఎలాంటి సేవలు పొందలేరు

1 / 5
మీ కంపెనీ జారీ చేసే పే స్లిప్‌పై యూఏఎన్ నెంబర్ అనేది ఉంటుంది. ఒకవేళ పే స్లిప్‌పై లేకపోతే మీరు హెచ్ఆర్ లేదా యాజమాన్యాన్ని సంప్రదించి ఈ నెంబర్ పొందవచ్చు. ఈ నెంబర్ పొందిన తర్వాత దానిని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గతంలో ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో దీనిని యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు ఉండేది.

2 / 5
కానీ ఈపీఎఫ్ఓ ఇటీవల పోర్టల్ నుంచి ఈ సేవను తొలగించింది. ఇక నుంచి కేవలం ఉమాంగ్ యాప్ ద్వారా మాత్రమే మీరు దీనిని యాక్టివేట్ చేసుకోగలరు. ఇక యూఏఎన్‌ను స్వయంగా జారీ చేసుకోవాలనుకునే ఉద్యోగులు కూడా ఈ యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆధార్ ఆధారిత ఫేస్ రికగ్నినైజేషన్ కూడా అవసరం.

3 / 5
యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవడానికి హెచ్ఆర్‌ని సంప్రదించడం లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉమాంగ్ యాప్ ద్వారా సులువుగా చేసుకోవచ్చు. ఉద్యోగులు తమ ఆధార్, మొబైల్ నెంబర్ ఉపయోగించి యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ పీఎఫ్ ఖాతాను యాక్సెస్ చేయవచ్చు.

4 / 5
ముందుగా ఉమాంగ్ యాప్ తెరిచి ఈపీఎఫ్ సేవలను ఎంచుకోవాలి. అనంతరం యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆధార్, మొబైల్ నెంబర్ నమోదు చేయండి. అనంతరం ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేసి యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నుంచే నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

5 / 5
Follow Us