AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఈ ఒక్క పనిచేయకపోతే డబ్బులు పొందలేరు.. భవిష్యత్తులో ఇబ్బందే..

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు అలర్ట్. ఈ-నామినేషన్ ప్రక్రియను కేంద్రం తప్పనిసరి చేసింది. లేకపోతే పీఎఫ్ క్లెయిమ్ పొందటంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముంటుంది. మీ కుటుంబసభ్యులు మీ అమౌంట్‌ను క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీరు ఆన్‌లైన్ ద్వారా సులువుగా నామినేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయవచ్చు.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఈ ఒక్క పనిచేయకపోతే డబ్బులు పొందలేరు.. భవిష్యత్తులో ఇబ్బందే..
Epfo
Venkatrao Lella
|

Updated on: Jun 13, 2026 | 5:22 PM

Share

పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్నవారు కొన్ని పనులు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్నింటిని తప్పనిసరి చేసింది. అందులో ఒకటి ఈ-నామినేషన్. గతంలో నామినేషన్ తప్పనిసరి అనే నిబంధన లేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా నామినీ వివరాలను పొందుపర్చాలి. లేకపోతే మీరు ఆన్‌లైన్‌లో పీఎఫ్ సేవలు పొందలేరు. చాలామంది నామినీని నమోదు చేయడాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో మీరు సులువుగా నామినీ వివరాలను అప్డేట్ చేయవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

నామినీ అవసరం ఎందుకు..?

పీఎఫ్ ఖాతాదారుడికి ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగి మరణిస్తే.. కుటుంబసభ్యులకు నిధులు అందుతాయి. పీఎఫ్ అకౌంట్లోని నగదును నామినికి అందిస్తారు. అలాగే రూ.7 లక్షల జీవిత బీమా కూడా ఈపీఎఫ్‌వో అందిస్తోంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణిస్తే రూ.7 లక్షలను నామినీకి అందిస్తారు. దీంతో నామినీ వివరాలను ఈపీఎఫ్‌వోకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ నామినీ వివరాలు అందించకపోతే మీ పీఎఫ్ అకౌంట్లోని నగదును కుటుంబసభ్యులు క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈపీఎఫ్‌వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అదే ముందుగానే నామినీ వివరాలను ఆన్‌లైన్‌లో అందించడం వల్ల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించకుండానే ఆన్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేయాలి..?

-ఈపీఎఫ్‌వో వెబ్ సైట్ https://www.epfindia.gov.in/site_hi/index.php తెరవండి

-హోం పేజీలో సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోండి

-ఫర్ ఎంప్లాయిస్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి

-యూఏఎన్ ఆన్ లైన్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోండి

-మీ యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి

-ఆ తర్వాత మెనూ బార్‌లో మేనేజ్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి

-అనంతరం ఈ-నామినేషన్‌పై క్లిక్ చేయండి

-అక్కడ Having Family దగ్గర యస్ అని ఎంచుకోండి

-నామినీ ఆధార్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మీతో ఉన్న బంధుత్వం, అడ్రస్ వివరాలు ఎంటర్ చేయండి

-ఆ తర్వాత నామినీ ఫొటో అప్ లోడ్ చేయండి

-మరో నామినీని యాడ్ చేయాలంటే ‘Add Row’ పై క్లిక్ చేయండి

-నామినీకి మీ సొమ్ములో ఎంత షేర్ ఇవ్వాలనుకుంటున్నారనేది ఎంటర్ చేసి సేమ్ ఫ్యామిలీ డీటైల్స్‌పై క్లిక్ చేయండి

-ఆ తర్వాత ఈ-సైన్ చేయండి

-ఆధార్‌కు వచ్చే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఈ-సైన్ ప్రాసెస్ పూర్తవుతుంది.

Follow Us
అక్కడ సీనియర్స్.. ఇక్కడ జూనియర్స్.. మొత్తానికి చేతులెత్తేశారు
అక్కడ సీనియర్స్.. ఇక్కడ జూనియర్స్.. మొత్తానికి చేతులెత్తేశారు
ఇంటిమేట్ సీన్స్ చేయడానికి కారణం ఇదే..
ఇంటిమేట్ సీన్స్ చేయడానికి కారణం ఇదే..
దంచికొడుతున్న వానలు.. రేపు బడులకు సెలవ్ ఆ రాష్ట్రాల్లో..!
దంచికొడుతున్న వానలు.. రేపు బడులకు సెలవ్ ఆ రాష్ట్రాల్లో..!
వరుణిడి విశ్వరూపం.. దేశరాధాని ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు..
వరుణిడి విశ్వరూపం.. దేశరాధాని ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు..
మిత్రుడి మరణం తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్చిన రషీద్ ఖాన్
మిత్రుడి మరణం తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్చిన రషీద్ ఖాన్
బీఎస్ఎన్‌ఎల్ నుంచి శాటిలైట్ ఫోన్.. ధర ఎంతంటే..?
బీఎస్ఎన్‌ఎల్ నుంచి శాటిలైట్ ఫోన్.. ధర ఎంతంటే..?
బ్యాక్టీరియాకు చెక్.. వర్షాకాలంలో ఈ పండ్లను డోంట్ మిస్..
బ్యాక్టీరియాకు చెక్.. వర్షాకాలంలో ఈ పండ్లను డోంట్ మిస్..
జబర్దస్త్ ఫైమా పెళ్లికి నాగబాబు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? వీడియో
జబర్దస్త్ ఫైమా పెళ్లికి నాగబాబు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? వీడియో
బెడ్‌రూమ్‌లో ఈ చిన్న పనిచేస్తే నిమిషాల్లో కునుకు పడుతుంది!
బెడ్‌రూమ్‌లో ఈ చిన్న పనిచేస్తే నిమిషాల్లో కునుకు పడుతుంది!
ల్యాప్‌టాప్‌తో తలపై కొట్టిన క్లాస్‌మేట్.. MBBS విద్యార్ధిని మృతి
ల్యాప్‌టాప్‌తో తలపై కొట్టిన క్లాస్‌మేట్.. MBBS విద్యార్ధిని మృతి