ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ అలవెన్స్ (ఈఎల్‌ఐ) పథకం కింద ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో యూఏఎన్ యాక్టివేట్ చేయాలి. వారి బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలి. ఈ పని కోసం EPFO గడువును పొడిగించింది. అంతకుముందు నవంబర్ 30 వరకు గడువు విధించారు. దానిని డిసెంబర్ 15 వరకు పొడిగించారు. ఇప్పుడు ఆ సమయాన్ని జనవరి 15 వరకు పొడిగించారు.
ఇది కూడా చదవండి: Isha Ambanis: అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
UAN అంటే ఏమిటి?
యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది ఆన్‌లైన్‌లో EPFO సేవలను యాక్సెస్ చేయడానికి ఉద్యోగికి అందించే ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్య. ఆధార్ నంబర్ లాగా, ఇది ఉద్యోగికి ప్రత్యేకమైన నంబర్. ఉద్యోగాలు మారేటప్పుడు కొత్త EPF ఖాతాను సృష్టించినప్పటికీ, అదే UAN నంబర్‌ను కొనసాగించవచ్చు. ఉద్యోగి అన్ని ఈపీఎఫ్ ఖాతాలు ఒకే UAN నంబర్ కింద ఉంటాయి. ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నా ఒకే అకౌంట్‌పై విలీనం చేసుకోవచ్చు.
బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేయాలి
ఈపీఎఫ్ ఖాతా నుంచి నేరుగా బ్యాంకు ఖాతాకు నగదును విత్‌డ్రా చేసుకునేటప్పుడు ఆ ఖాతాకు ఉద్యోగి ఆధార్‌ను అనుసంధానం చేయాలి. అన్ని DBT పథకాలలో ఇది తప్పనిసరి.
ELI పథకం అంటే ఏమిటి?
ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గత బడ్జెట్‌లో (జూలై 2024) ప్రకటించారు. దీని కింద మూడు పథకాలను ప్రకటించారు. కొత్త ఉద్యోగులకు ప్రభుత్వం ఒక నెల జీతం ఇస్తుంది. మరో రెండు పథకాల్లో అదనంగా ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగులు UANను యాక్టివేట్ చేయాలి. బ్యాంకు ఖాతాకు ఆధార్ సీడ్ చేయాలి. జనవరి 15 వరకు గడువు విధించారు.
ఇది కూడా చదవండి: Realme 14 Pro Series: ఉష్ణోగ్రతను బట్టి రంగులు మార్చే స్మార్ట్ ఫోన్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడు?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి