Electric Car: టెస్లాకే గట్టి పోటీ.. భారత్‌లోకి పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. రేంజ్‌ ఎంతో తెలిస్తే మతిపోతుంది!

Electric Car: భారతదేశంలో Z9 GT అధికారిక ధరను, దాని పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. ప్రస్తుత మార్కెట్ అంచనాల ప్రకారం, దీని ధర రూ. 1.10 కోట్ల నుండి రూ. 1.50 కోట్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారును పూర్తిగా అసెంబుల్..

Electric Car: టెస్లాకే గట్టి పోటీ.. భారత్‌లోకి పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. రేంజ్‌ ఎంతో తెలిస్తే మతిపోతుంది!
Byd Denza Z9 Gt

Updated on: Sep 18, 2026 | 3:39 PM

BYD Denza Z9 GT: బీవైడీ గ్రూప్ ప్రీమియం కార్ బ్రాండ్ అయిన డెన్సా భారతదేశ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో కొత్త పోటీని సృష్టించడానికి సిద్ధమవుతోంది. డెన్సా 2026 చివరి నాటికి భారతదేశంలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. ప్రారంభంలో Z9 GT, D9 అనే రెండు మోడళ్లను పరిచయం చేయవచ్చని సమాచారం.

Z9 GT ఒక సంప్రదాయ ఎలక్ట్రిక్ కారు కాదు, ఇది ఒక అధిక పనితీరు గల ప్రీమియం షూటింగ్-బ్రేక్ మోడల్. భారతదేశంలో BYD ప్రస్తుతం విక్రయిస్తున్న కార్ల కంటే అధిక ధర, ప్రీమియం విభాగంలో డెన్సా బ్రాండ్‌ను నిలబెట్టాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. Z9 GT అతిపెద్ద బలం దాని శక్తివంతమైన మూడు-మోటార్ల వ్యవస్థ. ఈ కారుకు ముందు భాగంలో ఒక ఎలక్ట్రిక్ మోటార్, వెనుక భాగంలో రెండు మోటార్లు ఉన్నాయి.

ఇవి రెండూ కలిసి గరిష్టంగా 850 kW, లేదా సుమారు 1,156 PS పవర్‌ని అందిస్తాయి. దీని గరిష్ట టార్క్ 1,210 న్యూటన్ మీటర్లు. ఇంత శక్తితో Z9 GT కేవలం 2.7 సెకన్లలో 0 నుండి 100 km/h వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 270 km/h అని నివేదించారు. అంటే ఇది కుటుంబంతో ప్రయాణించడానికి అనువుగా కనిపించినప్పటికీ, డిజైన్ పరంగా మాత్రం స్పోర్ట్స్ కార్లకు దీటుగా పనితీరును అందించేలా దీనిని రూపొందించారు.

ఇది కూడా చదవండి: BSNL Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూపాయికే 24 రోజుల వ్యాలిడిటీ..!

రేంజ్, ఛార్జింగ్ పరంగా కూడా Z9 GT దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది 122.49 kWh సామర్థ్యం గల రెండవ తరం ప్లేట్ బ్యాటరీని ఉపయోగిస్తుంది. WLTP టెస్టింగ్ పద్ధతి ప్రకారం, ఇది ఒకే పూర్తి ఛార్జ్‌పై 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. ఇది ఫ్లాష్ ఛార్జింగ్ అనే హై-స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా అందిస్తుంది. ఇది గరిష్టంగా 1,500 kW వరకు ఛార్జింగ్ పవర్‌కు మద్దతు ఇస్తుందని నివేదించారు. కంపెనీ ప్రకారం, బ్యాటరీని 10 శాతం నుండి 70 శాతానికి ఛార్జ్ చేయడానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే పడుతుంది.

అంతేకాకుండా 10 నుండి 97 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి సుమారు 9 నిమిషాలు పడుతుందని BYD పేర్కొంది. ఈ ఛార్జింగ్ వేగం భారతదేశంలో ఎంతవరకు అందుబాటులో ఉంటుందనేది ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది. పనితీరుతో పాటు, Z9 GTలో ప్రీమియం ఫీచర్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో డ్యూయల్-ఛాంబర్ ఎయిర్ సస్పెన్షన్, రియర్-వీల్ స్టీరింగ్ వంటి టెక్నాలజీలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Business Ideas: కేవలం రూ.5 వేలతో మీ జీవితాన్ని మార్చే బిజినెస్‌ గురించి మీకు తెలుసా?

ముఖ్యంగా గ్రాబ్-వాక్ అని పిలిడే ఈ ప్రత్యేకమైన వాహన నిర్వహణ ఫీచర్ గరిష్టంగా 15 డిగ్రీల వరకు పనిచేస్తుందని ప్రసిద్ధి చెందింది. ఈ కారు 5.1 మీటర్ల కంటే పొడవుగా ఉన్నప్పటికీ, ఇరుకైన ప్రదేశాలలో కారును తిప్పడానికి, పట్టణ రహదారులపై సులభంగా నడపడానికి వీలుగా రియర్-వీల్ స్టీరింగ్ వంటి ఫీచర్లు రూపొందించారు. అందువల్ల, ఇది ఒక పెద్ద ప్రీమియం కారు అయినప్పటికీ, టెన్సా డ్రైవర్‌కు సులభమైన నియంత్రణను అందించడానికి ప్రయత్నించింది.

డెన్సా ఇంకా భారతదేశంలో Z9 GT అధికారిక ధరను, దాని పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. ప్రస్తుత మార్కెట్ అంచనాల ప్రకారం, దీని ధర రూ. 1.10 కోట్ల నుండి రూ. 1.50 కోట్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

ఈ కారును పూర్తిగా అసెంబుల్ చేసిన స్థితిలో భారతదేశానికి దిగుమతి చేస్తారా? ఏ బ్యాటరీ, ఛార్జింగ్ సిస్టమ్‌ను అందిస్తారు.. అలాగే భారతీయ టెస్టింగ్ సిస్టమ్‌లో ఎంత రేంజ్ అందుబాటులో ఉంటుంది వంటి వివరాలు అధికారిక లాంచ్‌లో మాత్రమే స్పష్టమవుతాయి. అయినప్పటికీ, 1,156 PS పవర్, 1,210 న్యూటన్ మీటర్ల టార్క్, 2.7 సెకన్లలో 0-100 kmph వేగం, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో, Z9 GT భారతదేశపు ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో ఖచ్చితంగా, దృష్టిని ఆకర్షించే మోడల్ అవుతుంది.

ఇది కూడా చదవండి: Ration Card: రేషన్‌కార్డు ఉన్న వారికి బిగ్‌ షాక్‌.. వీరి రేషన్‌ నిలిపివేత..!

ఇది కూడా చదవండి: బంగారం ధరలు పెరిగినా తక్కువ ధరల్లో జ్యువెలరీస్‌ కొనడం ఎలాగో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us