New Dell Laptops: 17 గంటల బ్యాటరీ లైఫ్, AI పవర్.. డెల్ నుంచి 4 కొత్త ల్యాప్‌టాప్‌లు లాంచ్.. భారీ తగ్గింపు ధరతో..

New Dell Laptops: గేమింగ్ ప్రియుల కోసం, డెల్ ఏలియన్‌వేర్ 15ను పరిచయం చేసింది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ 7 సిరీస్ 2 ప్రాసెసర్, ఎన్విడియా జిఫోర్స్ RTX 5060 గ్రాఫిక్స్ కార్డ్ వరకు గల ఆప్షన్‌లతో వస్తుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌కు..

New Dell Laptops: 17 గంటల బ్యాటరీ లైఫ్, AI పవర్.. డెల్ నుంచి 4 కొత్త ల్యాప్‌టాప్‌లు లాంచ్.. భారీ తగ్గింపు ధరతో..
New Dell Laptops

Updated on: Jul 30, 2026 | 7:26 AM

New Dell Laptops: డెల్ తన అత్యంత ప్రీమియం సిరీస్‌ను అప్‌డేట్ చేసింది. ఇందులో భాగంగా ఐకానిక్ డెల్ XPS 13, గేమర్‌ల కోసం ఏలియన్‌వేర్ 15, AI-ఆధారిత డెల్ 14S, డెల్ 16S లను విడుదల చేసింది. ఈ నాలుగు ల్యాప్‌టాప్‌ల స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధరలను ఇప్పుడు చూద్దాం.

డెల్ XPS 13: ఇప్పటివరకు ఉన్న ల్యాప్‌టాప్‌లలోకెల్లా అత్యంత సన్నని, తేలికైనది:

డెల్ XPS 13 తమ XPS ల్యాప్‌టాప్‌లలోకెల్లా అత్యంత సన్ననిది. అలాగే తేలికైనది అని కంపెనీ పేర్కొంది. ఇది కేవలం 12.7mm మందంతో సుమారు 1kg బరువు ఉంటుంది. అల్యూమినియం బాడీతో వచ్చే ఈ ల్యాప్‌టాప్, ఇంటెల్ కోర్ సిరీస్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే 32GB వరకు LPDDR5X RAMకు మద్దతు ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే, ఇది 17 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఏలియన్‌వేర్ 15: గేమర్‌ల కోసం శక్తివంతమైనది:

గేమింగ్ ప్రియుల కోసం, డెల్ ఏలియన్‌వేర్ 15ను పరిచయం చేసింది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ 7 సిరీస్ 2 ప్రాసెసర్, ఎన్విడియా జిఫోర్స్ RTX 5060 గ్రాఫిక్స్ కార్డ్ వరకు గల ఆప్షన్‌లతో వస్తుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే 15.3-అంగుళాల WUXGA డిస్‌ప్లేను కలిగి ఉంది. అధునాతన థర్మల్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉన్న ఈ ల్యాప్‌టాప్, నీళ్లు పడినా, చిన్నపాటి దెబ్బలను తట్టుకునేలా కూడా పరీక్షించింది కంపెనీ.

ఏలియన్‌వేర్ 15 ప్రారంభ ధర రూ.1,28,990. బ్యాంక్ ఆఫర్‌లు రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుతో రూ.22,600 విలువైన ఏలియన్‌వేర్ 320Hz గేమింగ్ మానిటర్‌ను కేవలం రూ.₹9,999కే అందిస్తున్నారు.

XPS 13లో 100 శాతం DCI-P3 కలర్ కవరేజ్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన 2.5K LCD టచ్ డిస్‌ప్లే ఉంది. ఇది 30Hz నుండి 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. సౌండ్ కోసం డాల్బీ అట్మోస్-ట్యూన్డ్ క్వాడ్ స్పీకర్లు అందించింది. భారతదేశంలో డెల్ XPS 13 ధర రూ.79,990 నుండి ప్రారంభమవుతుంది. దీనితో పాటు రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ , ఒక సంవత్సరం ఉచిత మెక్‌ఫీ సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Dell Tech

డెల్ 14S, డెల్ 16S: AI ఫీచర్స్‌:

డెల్ తన S-సిరీస్‌లో 14S, 16S ల్యాప్‌టాప్‌లను పరిచయం చేసింది. ఇవి ప్రత్యేకంగా కోపైలట్ AI ఫీచర్ల కోసం రూపొందించింది. ఈ ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 లేదా AMD రైజెన్ AI 400 సిరీస్ ప్రాసెసర్‌లతో వస్తాయి. వీటిలో 50 TOPS వరకు NPUలు ఉంటాయి.

90% మందికి తెలియని 10 చాట్‌జీపీటీ రహస్యాలు:

OLED డిస్ప్లే,రీసైకిల్ చేసిన డిజైన్: డెల్ 14Sలో FHD+ OLED ప్యానెల్ ఉండగా, డెల్ 16Sలో 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో కూడిన 2.8K OLED టచ్ ప్యానెల్ ఉంది. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ రెండు ల్యాప్‌టాప్‌లను రీసైకిల్ చేసిన అల్యూమినియం, ప్లాస్టిక్‌తో తయారు చేశారు. డెల్ 14S ధర రూ.119,900 నుండి ప్రారంభం కాగా, డెల్ 16S ధర రూ.229,900 నుండి ప్రారంభమవుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us