AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Prices: మోత మోగిస్తున్న చికెన్, కోడిగుడ్ల ధరలు.. ఊహించని విధంగా ధరల్లో మార్పులు.. కిలో ఎంతంటే..?

నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. కోళ్ల దాణా ఖర్చులు భారీగా పెరగడం, ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు ముందే ఈ ధరల మోత మోగడం సామాన్యులపై భారం మోపుతోంది.

Chicken Prices: మోత మోగిస్తున్న చికెన్, కోడిగుడ్ల ధరలు.. ఊహించని విధంగా ధరల్లో మార్పులు.. కిలో ఎంతంటే..?
Chicken Prices
Venkatrao Lella
|

Updated on: Nov 14, 2026 | 7:54 PM

Share

నాన్ వెజ్ ప్రియులకు పిడుగులాంటి వార్త. చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల దసరా, దీపావళి లాంటి వరుస పండుగల క్రమంలో డిమాండ్ వల్ల ధరలు పెరగ్గా.. ఇప్పటికీ అదే స్థా్యిలో కొనసాగుతున్నాయి. అయితే ఎల్‌నివో ప్రభావం వల్ల మేత కొరత, మేత ధరలు పెరగడం వల్ల రాబోయే రోజుల్లో కోడిగుడ్లు, చికెన్ ధరలు భారీగా పెరగనున్నట్లు పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ నాటికి ధరలు ఏకంగా 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో నాన్‌వెజ్ ప్రియులకు ముద్ద దిగాలంటే జేబులకు చిల్లులు పడక తప్పని పరిస్థితి రానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలివే..

-నవంబర్ 14వ తేదీన చికెన్ ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.252 వద్ద కొనసాగుతుండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.223, రిటైల్ లైవ్ బర్డ్ రూ.144, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.117కు లభిస్తున్నాయి

-తెలంగాణతో పోలిస్తే ఏపీలో చికెన్ ధరలు మరింత పెరిగాయి. విజయవాడ జోన్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.266, డ్రస్స్‌డ్ రూ.236, రిటైల్ లైవ్ బర్డ్ రూ.152, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.125గా కొనసాగుతోంది

కోడిగుడ్ల రేట్లు ఎలా ఉన్నాయంటే..?

హైదరాబాద్‌లో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.88 వద్ద ఉండగా.. విజయవాడ జోన్ పరిధిలో రూ.80గా కొనసాగుతున్నాయి.

ధరల పెరుగుదలకు కారణాలు..

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతుండటంతో మార్కెట్‌లో మాంసానికి డిమాండ్ విపరీతంగా పెరుగనుంది. ఎల్నివో వల్ల కోళ్లకు పెట్టే దానా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. మొక్కజొన్న, నూకల ధరలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యాయి. గత ఏడాది కిలో రూ.18 ఉన్న మొక్కజొన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.34కి చేరుకుంది. ఇది డిసెంబర్ నాటికి రూ.40 చేరుతుందని చెబుతున్నారు. అలాగే కిలో రూ.14 నుంచి రూ.15 ఉన్న నూకల ధర ప్రస్తుతం 31 నుంచి 32 రూపాయలకు ఎగబాకింది. దీంతో పౌల్ట్రీ రైతులకు ఖర్చు పెరగడంతో ధరలు పెంచేందుకు సిద్దమవుతున్నారు. ఖర్చులు పెరగడం వల్ల డిసెంబర్, జనవరి నాటికి పౌల్ట్రీ ఉత్పత్తి ఏకంగా 20 శాతానికిపైగా తగ్గిపోతుందని వ్యాాాపారులు చెబుతున్నారు. ఒకవైపు దానా ధరల మంట, మరోవైపు పడిపోయిన ఉత్పత్తి వంటివి చికెన్, కోడిగుడ్ల ధరలను పెంచనున్నాయి. దీంతో ఇది సామాన్యుడి కంచంపై పడనుంది. ఇప్పటికే కూరగాయల ధరలు, పప్పుల ధరలు ఆందోళన కలిగిస్తుండగా.. ఇప్పుడు కోడిగుడ్డు, చికెన్ ధరలు కూడా పెరిగే సామాన్యుడిపై పెను భారం పడనుంది.

Follow Us
కొండెక్కిన చికెన్, కోడిగుడ్ల ధరలు.. అయ్యో.. కిలో ఎంతంటే..?
కొండెక్కిన చికెన్, కోడిగుడ్ల ధరలు.. అయ్యో.. కిలో ఎంతంటే..?
బుగ్గ మల్లేశ్వర క్షేత్రం.. శివుడి పక్కనే గంగమ్మ కొలువైన అద్భుత..
బుగ్గ మల్లేశ్వర క్షేత్రం.. శివుడి పక్కనే గంగమ్మ కొలువైన అద్భుత..
భారత్ మండపంలో అంబరాన్ని అంటిన ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు
భారత్ మండపంలో అంబరాన్ని అంటిన ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు
ఇంట్లోనే గింజల ద్వారా తామర పూలను ఎలా పెంచాలి? గార్డెనింగ్ టిప్స్
ఇంట్లోనే గింజల ద్వారా తామర పూలను ఎలా పెంచాలి? గార్డెనింగ్ టిప్స్
ఒకే ఒక్క సినిమాతో ఆయన విలన్‌గా బాగా పాపులర్ అయ్యాడు..
ఒకే ఒక్క సినిమాతో ఆయన విలన్‌గా బాగా పాపులర్ అయ్యాడు..
ఇలాంటి సందర్భాల్లో పీఎఫ్ కట్ అయినా పెన్షన్ బంద్..
ఇలాంటి సందర్భాల్లో పీఎఫ్ కట్ అయినా పెన్షన్ బంద్..
ఓటమి అంచు నుంచి విజయ శిఖరాలకు.. భారత్‌ను గెలిపించిన మోహిత్
ఓటమి అంచు నుంచి విజయ శిఖరాలకు.. భారత్‌ను గెలిపించిన మోహిత్
సినిమాల మీద పిచ్చితో మద్రాస్ రైలెక్కి..
సినిమాల మీద పిచ్చితో మద్రాస్ రైలెక్కి..
అరటిపండు తింటే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..? మీకు తెలియని నిజాల
అరటిపండు తింటే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..? మీకు తెలియని నిజాల
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్‌గా బీఎం సందీప్‌ నియామకం
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్‌గా బీఎం సందీప్‌ నియామకం