AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMart Bill: వారంలో ఈ రోజు డీమార్ట్‌కు వెళితే బిల్లు సగానికి తగ్గుతుందా..? ఎవ్వరికి తెలియని ట్రిక్స్‌ ఇవే!

DMart Shopping Bill: డీమార్ట్‌లో డబ్బు ఆదా చేయడానికి ప్రత్యేక రహస్య క్యాలెండర్ అవసరం లేదు. మీ షాపింగ్ విధానం మారితే చాలు. ప్రతి వస్తువును కార్ట్‌లో వేసే ముందు ఇది నిజంగా నాకు అవసరమా? అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి..

DMart Bill: వారంలో ఈ రోజు డీమార్ట్‌కు వెళితే బిల్లు సగానికి తగ్గుతుందా..? ఎవ్వరికి తెలియని ట్రిక్స్‌ ఇవే!
Dmart
Subhash Goud
|

Updated on: Oct 16, 2026 | 8:45 PM

Share

DMart Shopping Bill: డీమార్ట్‌లో షాపింగ్ అనేది అనేక మందికి నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకే పొందే మార్గంగా మారింది. అయితే, ఈ షాపింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి, డబ్బు ఆదా చేసుకోవడానికి కొన్ని స్మార్ట్ చిట్కాలు, అంతర్గత రహస్యాలను తెలుసుకోవడం ముఖ్యం. డీమార్ట్‌లో ఒక రోజు మాత్రమే షాపింగ్ చేస్తే బిల్లు సగానికి తగ్గిపోతుంది లేదా సీక్రెట్ డిస్కౌంట్ డే వంటి సోషల్ మీడియా ప్రచారాలు తరచుగా అపోహలే అని గుర్తుంచుకోవాలి. సామాజిక మాధ్యమాలలో శుక్రవారం, శనివారం లేదా ఆదివారం రాత్రి ప్రత్యేక ఆఫర్లు, 50% డిస్కౌంట్లు ఉంటాయని వైరల్ అయ్యే వార్తల్లో నిజం తక్కువ. డీమార్ట్ (Avenue Supermarts Limited) అఫీషియల్‌గా వారంలో ఒక ప్రత్యేక రోజున అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ప్రకటించదు. ప్రతి బ్రాంచ్‌లో స్టాక్, ఆఫర్లు, స్థానిక ప్రమోషన్లు మారుతూ ఉంటాయి. హైదరాబాద్‌లో ఉన్న ఆఫర్ బెంగళూరులో ఉండకపోవచ్చు. అందుకే అలాంటి ప్రచారాలను గుడ్డిగా నమ్మకుండా, స్టోర్‌లో డిస్‌ప్లే చేసిన ఆఫర్ బోర్డులను, ప్రొడక్ట్ ప్రైస్ ట్యాగ్‌లను తనిఖీ చేయడం, అవసరమైతే అధికారిక డీమార్ట్ ప్లాట్‌ఫామ్‌లలో ధృవీకరించుకోవడం తెలివైన పని.

తెలివిగా షాపింగ్ చేసే సమయం:

మీరు ప్రశాంతంగా, తొందరపాటు లేకుండా షాపింగ్ చేయాలనుకుంటే వారాంతాల్లో పీక్ అవర్స్‌ను (ముఖ్యంగా శనివారం సాయంత్రం, ఆదివారం సాయంత్రం) నివారించడం మంచిది. ఆ సమయాల్లో స్టోర్‌లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. పార్కింగ్ నుండి బిల్లింగ్ కౌంటర్ల వరకు క్యూలు ఉంటాయి. దీనివల్ల ప్రొడక్టులను సరిపోల్చకుండా, తొందరపడి అనవసర వస్తువులను కొనే అవకాశం ఉంటుంది. వీక్ డేస్‌లో, ఉదయం లేదా రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో వెళ్లడం ద్వారా ప్రశాంతంగా షాపింగ్ చేయవచ్చు.

డీమార్ట్ తక్కువ ధరల రహస్యం:

పక్క సూపర్ మార్కెట్‌ల కంటే డీమార్ట్‌లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయి అనే ప్రశ్నకు అనేక కారణాలున్నాయి:

  • సొంత ప్రాపర్టీ అడ్వాంటేజ్: డీమార్ట్ చాలా స్టోర్‌లకు భారీ అద్దెలు చెల్లించకుండా, సొంత ప్రాపర్టీలను లేదా దీర్ఘకాలిక లీజులను కలిగి ఉంటుంది. ఇది ఆపరేషనల్ ఖర్చులను తగ్గిస్తుంది, ఆ ప్రయోజనాన్ని కస్టమర్‌లకు తక్కువ ధరల రూపంలో అందిస్తుంది.
  • బల్క్ బయింగ్ పవర్: డీమార్ట్ దేశవ్యాప్తంగా వందల స్టోర్‌ల కోసం ఒకేసారి భారీ మొత్తంలో స్టాక్‌ను కొనుగోలు చేస్తుంది. ఇలా పెద్ద ఆర్డర్‌లు ఇచ్చినప్పుడు, తయారీదారులతో మెరుగైన ధరలను చర్చించే అవకాశం ఉంటుంది.
  • సప్లై చైన్ ఆప్టిమైజేషన్: తయారీదారుల నుండి నేరుగా లేదా తక్కువ మధ్యవర్తులతో భారీ పరిమాణంలో స్టాక్ కొనుగోలు చేయడం ద్వారా సప్లై చైన్ ఖర్చులను తగ్గిస్తుంది. తక్కువ మార్జిన్, ఎక్కువ అమ్మకాలు: డీమార్ట్ అధిక లాభాల కంటే తక్కువ మార్జిన్‌తో ఎక్కువ వస్తువులను అమ్మడంపై దృష్టి సారిస్తుంది. ఇది ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించి, మొత్తం ఆదాయాన్ని పెంచుతుంది.

ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులు:

డీమార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు మీరు కొన్ని బ్రాండ్ తెలియని ఉత్పత్తులను గమనించవచ్చు. అవి ప్రైవేట్ లేబుల్ లేదా ఇన్-హౌస్ బ్రాండ్స్ అయ్యి ఉండొచ్చు. పెద్ద రీటైల్ కంపెనీలు తమకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవడానికి, ధరలపై నియంత్రణ కలిగి ఉండటానికి ఈ వ్యూహాన్ని అనుసరిస్తాయి. ఈ ఉత్పత్తులను కొనేటప్పుడు, కేవలం బ్రాండ్ పేరు చూసి కాకుండా, లేబుల్, తయారీదారు వివరాలు, పదార్థాలు, ఎక్స్‌పైరీ డేట్, FSSAI లేదా ఇతర నాణ్యత ధృవీకరణలను పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది.

స్టోర్ లేఅవుట్, ఇంపల్స్ బయింగ్:

కొన్ని రీటైల్ స్టోర్‌లలో గడియారాలు లేదా బయట ప్రపంచాన్ని చూపించే కిటికీలు తక్కువగా ఉంటాయి. ఇది కస్టమర్‌లు ఎక్కువ సమయం స్టోర్‌లో గడిపే అవకాశం కల్పిస్తుందని రీటైల్ సైకాలజీ చెబుతుంది. అయితే, డీమార్ట్ కావాలనే ఇలా చేస్తుందని నిర్ధారించడానికి అధికారిక ఆధారాలు లేవు. బిల్లింగ్ కౌంటర్ల దగ్గర కనిపించే చాక్లెట్లు, చూయింగ్ గమ్‌లు, స్నాక్స్ వంటి చిన్న వస్తువులు “ఇంపల్స్ బయింగ్”ను ప్రోత్సహిస్తాయి. మీరు ఇంటి నుంచి కొనుగోలు చేయాలని అనుకోకపోయినా, క్యూలో నిలబడినప్పుడు ఇది పది రూపాయలే, పిల్లల కోసం తీసుకెళ్దాం అనిపించి కార్ట్‌లో వేస్తారు. ఈ చిన్న వస్తువులన్నీ కలిపి మీ బిల్లుకు అదనంగా వందల రూపాయలు చేర్చగలవు. బిల్లింగ్ కౌంటర్ వద్దకు వెళ్లే ముందు మీ ట్రాలీని ఒకసారి పరిశీలించి, అవసరం లేని వస్తువులను తిరిగి షెల్ఫ్‌లో పెట్టడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

ట్రాలీ వర్సెస్ బాస్కెట్:

చిన్న షాపింగ్ కోసం పెద్ద ట్రాలీని తీసుకోవడం వల్ల అది ఖాళీగా కనిపించగానే అనవసర వస్తువులతో నింపేయాలనిపిస్తుంది. అందుకే కొద్దిపాటి షాపింగ్ అయితే బాస్కెట్‌ను ఉపయోగించడం మంచిది. మంత్లీ షాపింగ్ లేదా భారీ కొనుగోళ్లకు మాత్రమే ట్రాలీని ఎంచుకోండి.

ఇవి గుర్తించుకోండి:

1. షాపింగ్ లిస్ట్ లేకుండా స్టోర్‌కు వెళ్లొద్దు.

2. ఆఫర్ కనిపించిందని వెంటనే కొనకుండా, ఒరిజినల్ MRP, ప్రస్తుత ధర, క్వాంటిటీ, క్వాలిటీ అన్నింటినీ సరిపోల్చండి.

3. బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇంపల్స్ బయింగ్‌ను నియంత్రించండి.

4. ఐ-లెవెల్ షెల్ఫ్‌లనే కాకుండా, దిగువ షెల్ఫ్‌లను కూడా చూడండి. అక్కడ బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రొడక్టులు ఉంటాయి.

5. ఒక ప్రత్యేక రోజు వెళ్తే 50% డిస్కౌంట్ ఖాయం అనే సోషల్ మీడియా మాటలను గుడ్డిగా నమ్మకండి.

డీమార్ట్‌లో డబ్బు ఆదా చేయడానికి ప్రత్యేక రహస్య క్యాలెండర్ అవసరం లేదు. మీ షాపింగ్ విధానం మారితే చాలు. ప్రతి వస్తువును కార్ట్‌లో వేసే ముందు ఇది నిజంగా నాకు అవసరమా? అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈ స్మార్ట్ షాపింగ్ చిట్కాలు మీ డీమార్ట్ అనుభవాన్ని మరింత లాభదాయకంగా మారుస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us