Budget 2024: బీమా రంగంపై బడ్జెట్ ఎఫెక్ట్…టీడీఎస్ విషయంలో కీలక నిర్ణయం

|

Jul 31, 2024 | 3:40 PM

కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌లో పన్ను విధానంలో కీలక చర్యలను ప్రతిపాదించారు. ముఖ్యంగా బడ్జెట్ 2024లో బడ్జెట్‌లో టీడీఎస్ రేటు రెండు శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం ప్రకటించారు. చట్టంలోని సెక్షన్ 194 డీఏ ప్రకారం టీడీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు.

Budget 2024: బీమా రంగంపై బడ్జెట్ ఎఫెక్ట్…టీడీఎస్ విషయంలో కీలక నిర్ణయం
Insurance Policy
Follow us on

కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌లో పన్ను విధానంలో కీలక చర్యలను ప్రతిపాదించారు. ముఖ్యంగా బడ్జెట్ 2024లో బడ్జెట్‌లో టీడీఎస్ రేటు రెండు శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం ప్రకటించారు. చట్టంలోని సెక్షన్ 194 డీఏ ప్రకారం టీడీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194  డీఏను సవరించడం ద్వారా బోనస్‌తో సహా జీవిత బీమా పాలసీ కవర్‌పై టీడీఎస్‌ను తగ్గించే ప్రతిపాదన అక్టోబర్ 1, 2024 నుండి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ తాజా తగ్గింపు పాలసీదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో?  ఓ సారి తెలుసుకుందాం. 

ముఖ్యంగా బడ్జెట్ 2024లో బీమా కమీషన్ చెల్లింపుపై టీడీఎస్‌కు సంబంధించిన సెక్షన్ 194డీకి సవరణను ప్రతిపాదించారు. బీమా పాలసీదారుడికి ఏదైనా ఆదాయాన్ని రెమ్యునరేషన్ లేదా రివార్డ్ ద్వారా చెల్లించడానికి బీమా కంపెనీ ఇకపై 2 శాతం చొప్పున టీడీఎస్‌ను మినహాయించాలి. ఈ సవరణ ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తుంది. బీమా రంగానికి సంబంధించి జీవిత బీమా సంస్థలు క్లెయిమ్ చేసిన ఖర్చుల తగ్గింపులను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఈ చర్యలు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవిత బీమా కంపెనీలు నాన్-బిజినెస్ ఖర్చులను క్లెయిమ్ చేసిన సందర్భాల మధ్య ఈ ప్రతిపాదన వచ్చింది. జీవిత బీమా వ్యాపారానికి సంబంధించిన లాభాలను గణించడంలో సెక్షన్ 37కు సంబంధించిన నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యం కాని వ్యయాలను అందించే సవరణను బడ్జెట్ ప్రతిపాదించింది. ఈ సవరణ ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. 

అదేవిధంగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను పెంచాలనే బడ్జెట్ ప్రతిపాదన యులిప్ పాలసీదారులపై పన్ను బాధ్యతలను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే సంవత్సరానికి రూ.2.5 లక్షల కంటే తక్కువ ప్రీమియంతో పాలసీలను కొనుగోలు చేసే యూలిప్ హోల్డర్లు సెక్షన్ 10 (10డీ) కింద ప్రయోజనాలను పొందడం కొనసాగించవచ్చు. అలాగే వారు మెచ్యూరిటీపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీ చెల్లింపులపై టీడీఎస్‌ను 5 శాతం నుంచి 2శాతానికి తగ్గించడాన్ని నిపుణులు స్వాగతిస్తుననారు. ఇది వినియోగదారుల లిక్విడిటీని పెంచుతుందని వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..