రూ. 50 లక్షల హోమ్ లోన్ EMIలో ఇలా చేస్తే.. చివరికి రూ. 59 లక్షలు మిగుల్చుకోవచ్చు.. ఎలానో మీరూ చూడండి

హోమ్ లోన్ ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడానికి ఈజీ మార్గం ఇదిగో. మీ EMIలో 10 శాతం ప్రతి నెలా SIPలో పెట్టుబడిగా పెట్టడం ద్వారా, మీరు రుణం తీర్చే సమయానికి పెద్ద మొత్తంలో సంపదను సృష్టించవచ్చు. అదనపు డబ్బును లోన్ క్లియర్ చేయడానికి బదులుగా SIPలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిటైర్‌మెంట్ కోసం ఆర్థిక భద్రత పొందొచ్చు.

రూ. 50 లక్షల హోమ్ లోన్ EMIలో ఇలా చేస్తే.. చివరికి రూ. 59 లక్షలు మిగుల్చుకోవచ్చు.. ఎలానో మీరూ చూడండి
Home Loan

Updated on: Apr 09, 2026 | 5:47 PM

సొంత ఇల్లు కొనాలనేది మధ్యతరగతి కుటుంబాల అతిపెద్ద కల. అయితే, ఈ కలను నిజం చేసుకునే క్రమంలో హోమ్ లోన్ తీసుకోవడం వల్ల ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఉదాహరణకు, రూ. 50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే, 9 శాతం వడ్డీతో 20 ఏళ్ల టెన్యూర్‌కు నెలకు రూ. 45,000 EMI చెల్లించాల్సి ఉంటుంది. అంటే 20 ఏళ్లు పూర్తయ్యేసరికి తీసుకున్న అప్పు కంటే ఎక్కువ మొత్తాన్ని(సుమారు రూ. 50-58 లక్షలు) వడ్డీ రూపంలోనే బ్యాంకుకు చెల్లిస్తాం. ఇది పిల్లల చదువులు, రిటైర్‌మెంట్ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి బిజినెస్ నిపుణులు పలు సలహాలు ఇస్తున్నారు “10 శాతం రూల్” అనే ఒక బెస్ట్ ఆప్షన్ సూచించారు. మీరు ప్రతి నెలా చెల్లించే EMI మొత్తంలో 10 శాతాన్ని విడిగా ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో పెట్టుబడి పెట్టాలి. అంటే మీ EMI రూ. 45,000 అయితే, మరో రూ. 4,500 మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలి. మిడ్-అండ్ స్మాల్-క్యాప్ ఫండ్లలో సగటున 14 శాతం రాబడిని ఆశించినా, 20 ఏళ్ల తర్వాత మీ వద్ద సుమారు రూ. 59 లక్షల సంపద సమకూరుతుంది. ఇది మీరు బ్యాంకుకు కట్టిన వడ్డీ మొత్తాన్ని తిరిగి పొందినట్లు అవుతుంది.

ఇది చదవండి: మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..

చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే, బోనస్ లేదా అదనపు డబ్బు వచ్చినప్పుడు గృహ రుణాన్ని ముందుగానే కట్టేయాలని చూస్తారు. కానీ బ్యాంకులు లోన్ ప్రారంభంలోనే అధిక వడ్డీని వసూలు చేస్తాయి కాబట్టి, మధ్యలో కట్టే డబ్బు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దానికి బదులుగా ఆ అదనపు మొత్తాన్ని SIPలో చేర్చడం వల్ల కాలక్రమేణా రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు సంపదను సృష్టించవచ్చు. ఈ విధానం గృహ రుణానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ పెట్టుబడి కేవలం సంపద సృష్టి మాత్రమే కాదు, కుటుంబానికి ఆర్థిక భరోసాను కూడా ఇస్తుంది. ఒకవేళ మీరు త్వరగా రిటైర్ కావాలనుకున్నా లేదా ఊహించని పరిస్థితులు ఎదురైనా ఈ నిధి అండగా ఉంటుంది. ఈ విధంగా కూడబెట్టిన రూ. 1 కోటి నిధిని ‘సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్'(SWP) ద్వారా నెలకు రూ. 50,000 ఆదాయం వచ్చేలా మార్చుకోవచ్చు. సొంత ఇల్లు ఉండి, నెలకు రూ. 50,000 రాబడి ఉంటే రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. కాబట్టి, అప్పును తీర్చడమే లక్ష్యంగా పెట్టుకోకుండా, 10 శాతం నియమంతో భవిష్యత్తుకు భద్రత కల్పించుకోవడమే సరైన ఆర్థిక సూత్రమని నిపుణులు అంటున్నారు.

ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..

Follow Us