AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులు మూతపడతాయంటే..?

వచ్చే వారంలో బ్యాంక్‌ను సందర్శించాలనుకుంటున్నారా.. అయితే బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవాల్సిందే. సెలవులు అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వచ్చే వారంలో వినాయక చవితి పండుగతో పాటు వివిధ ప్రాంతీయ సెలవుల కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో వీటి గురించి అందరూ తెలుసుకోవాలి.

Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులు మూతపడతాయంటే..?
Bank Holidays
Venkatrao Lella
|

Updated on: Sep 12, 2026 | 1:01 PM

Share

వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు మారనున్నాయి. వినాయక చివతి పండుగ వస్తుండటం, స్థానిక పండుగల కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ ఖాతాదారులు ఈ సెలవుల గురించి ముందే తెలుసుకోవాలి. దీని వల్ల ముందే ఆర్ధిక లావాదేవీలు అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రాంతాలను బట్టి బ్యాంక్ సెలవులు మారుతూ ఉంటాయి. దీంతో బ్యాంక్‌ను సందర్శించాలనుకుంటే ముందే సిబ్బందిని సంప్రదించి సమాచారం తెలుసుకోండి. అనంతరం బ్యాంక్‌కు వెళ్లడం ఉత్తమమైన మార్గం. వచ్చే వారం సెప్టెంబర్ 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు బ్యాంక్ సెలవుల గురించి ఒకసారి తెలుసుకుందాం.

వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. జాతీయ పండుగుల సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. ఇక రాష్ట్రాల అధికారిక సెలవులు, ప్రాంతీయ పండుగల సమయంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు మూసివేస్తారు. వీటిని ముందుగానే ఆర్బీఐ నిర్ణయిస్తుంది. దీంతో వీటి గురించి ఖాతాదారులు అవగాహన కలిగి ఉండాలి. వచ్చే వారం విషయానికొస్తే.. సెప్టెంబర్ 14వ తేదీన గణేష్ చతుర్ది సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ముంబై, నాగ్ పూర్, పనాజీ, బేలాపూర్‌లో బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక సెప్టెంబర్ 15వ తేదీన గణేష్ చతుర్ది రెండో రోజు సందర్భంగా అహ్మదాబాద్, భువనేశ్వర్ మరియు పనాజీలలో బ్యాంకులు ఉండవు.

ఏయే సేవలు నిలిచిపోతాయి..?

సెప్టెంబర్ 18వ తేదీన యూనిటేరియన్ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి. సెప్టెంబర్ 20న ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంకులు సెప్టెంబర్ 16, 17,19వ తేదీలలో బ్యాంకులు తెరిచి ఉంటాయి. రాష్ట్రం, నగరాన్ని బట్టి బ్యాంక్ సెలవుల్లో మార్పులు ఉంటాయి. దీంతో బ్రాంచ్‌ను సందర్శించేముందు సిబ్బందిని సంప్రదించి నిర్ధారించుకోండి. కేవలం భౌతిక శాఖలు మాత్రమే సెలవు రోజుల్లో మూతడతాయి. ఆన్ లైన్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. దీంతో యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. దీంతో బ్యాంక్ లావాదేవీల విషయంలో ఖాతాదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కేవలం చెక్కుల క్లియరెన్స్, భౌతిక రుణ పత్రాల వెరిఫికేషన్, బ్యాంక్ బ్రాంచ్ ద్వారా చేసే నగదు డిపాజిట్లు వంటి సేవలు అందుబాటులో ఉండవు.

Follow Us