AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ బ్యాంక్ అకౌంట్‌పై లీన్ మార్క్ పడిందా..? సింపుల్‌గా ఇలా చేస్తే సమస్య తొలగిపోయినట్లే..

బ్యాంక్ అకౌంట్స్‌లో లీన్ మార్క్, మనీ ఫ్రీజ్, సైబర్ క్రైమ్ ఫిర్యాదులు ఇటీవల బాగా పెరిగిపోతున్నాయి. థర్డ్ పార్టీ యాప్‌లు లేదా తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం వల్ల ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. డబ్బులు చిక్కుకుపోవడం వల్ల ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు.

మీ బ్యాంక్ అకౌంట్‌పై లీన్ మార్క్ పడిందా..? సింపుల్‌గా ఇలా చేస్తే సమస్య తొలగిపోయినట్లే..
Bank Account
Venkatrao Lella
|

Updated on: Nov 14, 2026 | 9:31 PM

Share

నేటి డిజిటల్ యుగంలో నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఎక్కువగా నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ వల్ల ట్రాన్సాక్షన్లు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అవ్వడం  లేదా లీన్ మార్క్ పడటం అనేది ఇటీవల కాలంలో మరింత ఎక్కువైంది.  సైబర్ క్రైమ్‌కు పాల్పడేవారు, అనుమానాస్పద లావాాదేవీలు, మ్యూల్ ఖాతాలు నిర్వహించేవారి అకౌంట్లే కాకుండా అపరిచితులతో జరిపిన లావాదేవీల కారణంగా అమాయకుల ఖాతాలు కూడా ఫ్రీజ్ అవుతున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్స్ నిర్వహించేవారు, ఆ యాప్స్‌లలో లావాదేవీలు జరిపేవారి అకౌంట్లు కూడా ఇటీవల కాలంలో ఎక్కుగా ఫ్రీజ్ అవుతున్నాయి. ఈ సమస్యల వల్ల తమ ఖాతాల్లోని సొమ్ము నిలిచిపోవడం వల్ల అమాయక ప్రజలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. లీన్ మార్క్, మనీ ఫ్రీజ్ అంటే ఏమిటి? మళ్లీ డబ్బులు ఎలా పొందాలనేది చూద్దాం.

లీన్ మార్క్ అంటే ఏంటి..?

లీన్ మార్క్ అనేది ఒక బ్యాంక్ ఖాతాపై విధించే తాత్కాలిక నిషేధంగా చెప్పవచ్చు. ఈ మార్క్ పడితే మీ అకౌంట్లోని డబ్బును ఉపసంహరించుకోవడానికి లేదా బదిలీ చేయడానికి అనుమతి ఉండదు. చట్టపరమైన ఉత్తర్వులు, సైబర్ క్రైమ్ ఫిర్యాదులు,  అనుమానాస్పద లావాదేవీల వల్ల ఇది జరుగుతుంది. మనీ ఫ్రీజ్ అంటే ఖాతా మొత్తం పూర్తిగా స్తంభింపజేయడం. దీనివల్ల మీకు అన్ని లావాదేవీలు నిలిచిపోతాయి. ఫ్రీజ్ అయిన బ్యాంక్ అకౌంట్‌ను మీరు అసలు ఎక్కడా ఉపయోగించలేరు. అనధికారిక  యాప్‌ల ద్వారా లావాదేవీలు జరపడం, అపరిచితుల వ్యక్తులతో లావాదేేేేేేవీలు నిర్వహించడం, తెలియకుండానే సైబర్ నేరగాళ్ల డబ్బును తమ ఖాతాల ద్వారా బదిలీ చేయడం, మోసపూరిత ఆఫర్లు బారిన పడి డబ్బులు పంపడం వల్ల మీ అకౌంట్ పూర్తిగా ఫ్రీజ్ అయ్యే అవకాశాలుంటాయి. ఒక సైబర్ క్రైమ్ కేసులో అనేక ఖాతాలు అనుమానిత జాబితాలోకి వస్తాయి. దీంతో మీకు సంబంధం లేకపోయినా అకౌంట్లు ఫ్రీజ్ అయ్యే అవకాశాలుంటాయి.

ఎలాంటి చర్యలు తీసుకోవాలి

ఒకసారి బ్యాంక్ ఖాతాపై లీన్ మార్క్ లేదా అది ఫ్రీజ్ అయినా పరిష్కరించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పనిగా చెప్పవచ్చు. బాధితులు బ్యాంకు అధికారులను సంప్రదించినప్పుడు సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించమని సూచిస్తున్నారు. సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించినప్పుడు “మీరు ఏదో క్రైమ్ చేసి ఉంటారు” అని అంటున్నారు. బ్యాంకులు, సైబర్ క్రైమ్ అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టేయడంతో అకౌంట్లలో డబ్బులు నిలిచిపోయినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

-మీకు తెలియని వ్యక్తులతో ఎలాంటి లావాదేవీలు చేయకండి. తెలియని వారి నుండి డబ్బు స్వీకరించడం లేదా వారికి డబ్బు పంపడం చేయవద్దు

-ఎవరైనా అత్యవసరమని డబ్బు అడిగినా వారికి నగదు రూపంలో సహాయం చేయండి

-పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరపాల్సి వచ్చినప్పుడు బ్యాంకులోకి వెళ్లి డిపాజిట్ చేయడం లేదా విత్‌డ్రా చేయడం వంటివి చేయండి

-అనధికారిక లేదా అనుమానాస్పద మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు జరపడం మానుకోండి

-సైబర్ క్రైమ్ మోసాల గురించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి

Follow Us