AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ కార్డు ఉన్నప్పటికీ ఏ సందర్భాల్లో చికిత్స లభించదు? నియమాలు ఏంటో తెలుసా..?

Ayushman Bharat Scheme: చికిత్స సమయంలో ఎవరిదైనా ఆయుష్మాన్ కార్డు పరిమితి అయిపోతే, అప్పుడు ఆరోగ్య శాఖ నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవచ్చు. చాలా సందర్భాలలో రోగి శారీరక పరిస్థితి లేదా వ్యాధి తీవ్రతను బట్టి అదనపు ఆర్థిక సహాయం ఆమోదిస్తారు..

Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ కార్డు ఉన్నప్పటికీ ఏ సందర్భాల్లో చికిత్స లభించదు? నియమాలు ఏంటో తెలుసా..?
Ayushman Card Free Treatment
Subhash Goud
|

Updated on: May 24, 2026 | 10:02 PM

Share

Ayushman Card Free Treatment: ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ రోజుల్లో కాలక్రమేణా వ్యాధులు మరింత సంక్లిష్టంగా మారడంతో చికిత్స ఖర్చు కూడా బాగా పెరిగింది. అన్ని వర్గాల వారికి వైద్య సహాయం అందించడానికి అనేక ఆరోగ్య పథకాలు ప్రారంభించింది కేంద్రం. అటువంటి ఆరోగ్య పథకాలలో ఆయుష్మాన్ భారత్ పథకం ఒకటి. ఈ పథకం కింద ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఉచిత చికిత్స ఎంతకు లభిస్తుంది?

ఆయుష్మాన్ కార్డు ఒక కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా ఆయుష్మాన్ భారత్‌లో నమోదైన ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఉచిత చికిత్స అందుబాటులో ఉంది. ఈ ఆరోగ్య పథకం ద్వారా లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. సంక్లిష్టమైన వ్యాధుల చికిత్స నుండి శస్త్రచికిత్సల వరకు, ఆయుష్మాన్ పథకం కింద వీటిని చేయించుకోవచ్చు. దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు.

ఇది కూడా చదవండి: Vastu Tips: ఈ వస్తువులను పొరపాటున కూడా ఫ్రిజ్‌పై ఉంచవద్దట..!

ఇవి కూడా చదవండి

అయితే, ఆయుష్మాన్ భారత్ పథకానికి ఒక పరిమితి ఉంది. ఆయుష్మాన్ కార్డు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందిస్తుంది. ఈ పరిమితికి చేరుకున్న తర్వాత, అంటే రూ. 5 లక్షలు ఖర్చు చేసిన తర్వాత ఇకపై ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉండవు. ఇక 70 ఏళ్లు దాటినవారికి రూ.10 లక్షల వరకు వైద్య సహాయం అందిస్తోంది. ఇటీవలే వయో వృద్దులకు రూ.5 లక్షల లిమిట్ అదనంగా పొడిగించింది.

మీరు ఒకేసారి ఐదు లక్షల రూపాయలు పొందగలరా?

ఐదు లక్షల రూపాయల ఉచిత చికిత్స పొందే అవకాశం జీవితంలో ఒక్కసారే లభిస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రతి సంవత్సరం పునరుద్దరిస్తుంటారు. అంటే, కొత్త సంవత్సరం ప్రారంభంలో ఐదు లక్షల రూపాయల ప్రయోజనం మళ్లీ లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఒక సంవత్సరంలో చికిత్స కోసం ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ఆ సంవత్సరంలో చేసే ఇతర చికిత్సల ఖర్చును కూడా వారే భరించాల్సి ఉంటుంది. అంటే మీ చికిత్స లిమిట్ దాటిన సందర్భంలో మళ్లీ వైద్యం కావాలంటే మీ జేబు నుంచి పెట్టుకోవాల్సిందే.

ఇది కూడా చదవండి: Gold Price: షాకింగ్‌ న్యూస్‌.. బంగారం 3 లక్షలు, వెండి 5 లక్షలు దాటనుందా?

ప్రత్యేక అనుమతి:

చికిత్స సమయంలో ఎవరిదైనా ఆయుష్మాన్ కార్డు పరిమితి అయిపోతే, అప్పుడు ఆరోగ్య శాఖ నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవచ్చు. చాలా సందర్భాలలో రోగి శారీరక పరిస్థితి లేదా వ్యాధి తీవ్రతను బట్టి అదనపు ఆర్థిక సహాయం ఆమోదిస్తారు. దీని కోసం ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఎంప్యానెల్డ్ ఆసుపత్రి పరిపాలనా విభాగాన్ని సంప్రదించవలసి ఉంటుంది. అక్కడ ప్రత్యేక అనుమతి పొందడానికి అవసరమైన పత్రాలు, విధానాలను వివరిస్తారు. ఆయుష్మాన్ కార్డు పరిమితి, పునరుద్ధరణ రాష్ట్ర నిబంధనలపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. అందువల్ల జిల్లా ఆరోగ్య శాఖ లేదా ఆసుపత్రిలోని ఆయుష్మాన్ సహాయ కేంద్రాన్ని సంప్రదించడం మంచిది.

ఇది కూడా చదవండి: Car Seat Belt: కారు సీటు బెల్టు జరిమానా తప్పించుకోవడానికే కాదు.. అసలు ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us