Auto Tips: ఏడాదిలో కారు, బైక్ కొనడానికి ఏ నెల అనుకూలం? వేల రూపాయలు ఆదా చేసే ట్రిక్స్‌..!

Auto Tips: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కారు మోడల్, బడ్జెట్ ఎంత ముఖ్యమో.. ఏ నెలలో కొంటున్నారు అనేది కూడా అంతే ముఖ్యం! సంవత్సరంలో కొన్ని ప్రత్యేక నెలల్లో ఆటోమొబైల్ కంపెనీలు, డీలర్లు భారీ డిస్కౌంట్లు, క్యాష్‌..

Auto Tips: ఏడాదిలో కారు, బైక్ కొనడానికి ఏ నెల అనుకూలం? వేల రూపాయలు ఆదా చేసే ట్రిక్స్‌..!
Auto Tips

Updated on: Aug 02, 2026 | 11:15 AM

Auto Tips: కారు కొనడం అనేది ప్రతీ కుటుంబానికి ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం. సరైన సమయంలో కొనుగోలు చేస్తే వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కారు మోడల్, బడ్జెట్ ఎంత ముఖ్యమో.. ఏ నెలలో కొంటున్నారు అనేది కూడా అంతే ముఖ్యం! సంవత్సరంలో కొన్ని ప్రత్యేక నెలల్లో ఆటోమొబైల్ కంపెనీలు, డీలర్లు భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ప్రత్యేక ఆఫర్లను ఇస్తుంటారు.

1. డిసెంబర్ – అత్యంత భారీ డిస్కౌంట్లు లభించే నెల

మీరు బడ్జెట్ ఆదా చేసుకోవడానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తే, డిసెంబర్ నెల కారు కొనడానికి అత్యుత్తమ సమయం. కారణం డిసెంబర్‌ నెల ఆ సంవత్సరం ముగిసే నెల. డిసెంబర్ నెలతో ఆ సంవత్సరం మోడల్ స్టాక్ ముగుస్తుంది. జనవరి రాగానే పాత సంవత్సరం తయారైన కార్ల డిమాండ్ తగ్గుతుంది. అందుకే డీలర్లు తమ వద్ద ఉన్న మిగిలిపోయిన స్టాక్‌ను (Year-end Stock) ఖాళీ చేయడానికి గరిష్ట డిస్కౌంట్లు ప్రకటిస్తారు. భారీ క్యాష్ డిస్కౌంట్లు, ఉచిత ఎక్స్‌టెన్డెడ్ వారంటీ, ఫ్రీ ఇన్సూరెన్స్, కార్ యాక్సెసరీస్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు  వంటి ప్రయోజనాలు ఎక్కువగా లభిస్తాయి. చిన్న ప్రతికూలత విషయానికొస్తే.. కొత్త సంవత్సరంలో రీసేల్ (Resale Value) ప్రాతిపదికన చూస్తే, మీ కారు ఒక సంవత్సరం పాతదిగా పరిగణిస్తారు. అయితే మీరు ఆ కారును 5 నుంచి 7 ఏళ్లకు పైగా ఉపయోగించాలనుకుంటే ఈ రీసేల్ ఫ్యాక్టర్ పెద్దగా ప్రభావం చూపదు.

2. సెప్టెంబర్ నుండి నవంబర్ (పండుగల సీజన్ – Festive Season):

భారతదేశంలో దసరా, ధన్‌తేరస్, దివాళీ పండుగల సమయంలో ఆటోమొబైల్ విక్రయాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. కొత్త కారు కొనడానికి పండుగల సమయాన్ని శుభప్రదంగా భావిస్తారు. దీంతో కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి తీవ్రంగా పోటీపడతాయి. తక్కువ వడ్డీ రేట్లతో ఫైనాన్స్ ఆఫర్లు, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే కొత్త మోడళ్ల లభ్యత, స్పెషల్ ఎడిషన్ వర్షన్లు అందుబాటులోకి రావడం. డిసెంబర్ అంత కాకపోయినా మంచి క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు.

ఇవి కూడా చదవండి

3. మార్చి (March) – ఆర్థిక సంవత్సరం ముగింపు (Financial Year End):

వ్యాపారవేత్తలకు, స్వయం ఉపాధి పొందే వారికి, టాక్స్ ఆదా చేయాలనుకునే వారికి మార్చి నెల అనుకూలమైనది. డీలర్లకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టార్గెట్లు ఉంటాయి. టార్గెట్ క్లియర్ చేయడం కోసం మంచి ఆఫర్లు ఇస్తారు. బిజినెస్ ఖాతా కలిగిన వారు మార్చి 31 కి ముందు కారు కొనుగోలు చేస్తే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకొని పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.

4. జూలై – ఆగస్టు

వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం ఆటోమొబైల్ రంగానికి కొంత మందగమనంగా ఉంటుంది. సేల్స్ తగ్గే అవకాశం ఉండటంతో డీలర్లు కస్టమర్లను ఆకర్షించేందుకు “మిడ్-ఇయర్ సేల్స్” లేదా మన్సూన్ ఆఫర్లు ఇస్తారు. ఈ సమయంలో ఆఫర్లు డిసెంబర్/పండుగల స్థాయి లో లేకపోయినా, డీలర్ వద్ద బేరమాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఏ నెలల్లో కారు కొనడం తక్కువ ప్రయోజనకరం?

జనవరి – ఫిబ్రవరి: కొత్త సంవత్సరం ప్రారంభంలో దాదాపు అన్ని కంపెనీలు తమ కార్ల ధరలను పెంచుతాయి. కొత్త మోడళ్ల స్టాక్ రావడంతో డిస్కౌంట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఏప్రిల్ – మే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కూడా కంపెనీల డిస్కౌంట్లు నార్మల్‌గా ఉంటాయి.

కారు కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ‘స్మార్ట్’ చిట్కాలు:

నెల చివరి వారంలో కొనండి: ఏ నెలలోనైనా నెల చివరి 3-4 రోజుల్లో కారు బుక్ చేసుకోవడం మంచిది. డీలర్‌షిప్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు తమ నెలవారీ టార్గెట్లు పూర్తి చేయడానికి అదనపు తగ్గింపులు ఇవ్వడానికి అంగీకరిస్తారు.

  • ఫేస్‌లిఫ్ట్ / మోడల్ చేంజ్: ఏదైనా కారు కొత్త వెర్షన్ (Facelift) వస్తుందని తెలిస్తే, మార్కెట్లో ఉన్న పాత వెర్షన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
  • ఇన్సూరెన్స్ బయట తీసుకోండి: డీలర్లు ఇచ్చే ఇన్సూరెన్స్ కంటే ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ కోట్ తీసుకుంటే వేల రూపాయిలు ఆదా అవుతాయి.
  • అత్యంత తక్కువ ధరకు/ఎక్కువ ఆదా కావాలంటే: డిసెంబర్ నెలను ఎంచుకోండి. పండుగ వాతావరణం, కొత్త మోడల్ కావాలంటే దసరా/దివాళీ (అక్టోబర్ – నవంబర్) సీజన్ ఉత్తమం. ఇక బిజినెస్, టాక్స్ సేవ్‌మెంట్ కోసం మార్చి నెల సరిగ్గా సరిపోతుంది.

ఇది కూడా చదవండి: Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ వాషింగ్.. ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం.. ఇలా కడగాలి!

ఇది కూడా చదవండి: Personal Finance: చిన్న పొదుపు-పెద్ద లాభాలు.. రోజుకు రూ.100 పెట్టుబడితో 1 కోటి రూపాయలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us