
ITR Filing Deadline: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు జూలై 31వ తేదీలోగా తమ రిటర్న్‌లను సమర్పించడానికి తొందరపడ్డారు. అయితే, కొందరిలో ఉన్న ఒక సాధారణ అపోహ ఏమిటంటే, జూలై 31వ తేదీ అందరు పన్ను చెల్లింపుదారులకు చివరి తేదీ అనుకున్నారు. కానీ అదేమి కాదు. చాలా మంది జీతం తీసుకునే ఉద్యోగులు, పెన్షనర్లు జూలై 31వ తేదీలోగా తమ రిటర్న్‌లను దాఖలు చేయాల్సి ఉండేది. కొంతమంది పన్ను చెల్లింపుదారులకు ఆగస్టు 31వ తేదీ వరకు గడువు ఉంటుందని మీకు తెలుసా? వర్తించే గడువు మీ ఆదాయ రకం మరియు మీరు దాఖలు చేయాల్సిన ITR ఫారంపై ఆధారపడి ఉంటుంది.
చాలా మంది జీతభత్యాలు పొందే ఉద్యోగులు, పింఛనుదారులు, గృహ ఆస్తి, మూలధన లాభాలు లేదా వడ్డీ వంటి ఇతర మార్గాల ద్వారా ఆదాయం పొందేవారికి, రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31.
వ్యాపార లేదా వృత్తిపరమైన ఆదాయం లేని వారికి, అంటే జీతభత్యాలు పొందే ఉద్యోగులు, పింఛనుదారులు, గృహ ఆస్తి, మూలధన లాభాలు లేదా ఇతర వనరుల నుండి ఆదాయం పొందే పన్ను చెల్లింపుదారులకు జూలై 31తో గడువు ముగిసింది. ప్రతి పన్ను చెల్లింపుదారునికి గడువు ఒకేలా ఉండదు. వ్యాపార లేదా వృత్తిపరమైన ఆదాయం కలిగి ఉండి, వారి ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వారు ఆగస్టు 31వ తేదీలోగా తమ రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. ఈ వర్గంలో సాధారణంగా ITR-3 లేదా ITR-4 ఫైల్ చేసే చాలా మంది ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు, నిపుణులు, చిన్న వ్యాపార యజమానులు ఉంటారు.
ITR ఫైల్ చేసే ముందు ఏ పన్ను చెల్లింపుదారు అయినా తమ ఆదాయ రకం. జీతం లేదా వ్యాపార ఆదాయం అని సరిచూసుకోవాలి. మీరు మీ ITR ఫారం నుండి మీ గడువు తేదీని కూడా తెలుసుకోవచ్చు. మీరు ITR-1 లేదా ITR-2 ఫైల్ చేస్తే, మీ గడువు తేదీ జూలై 31 వరకే మాత్రమే ఉంది. మీరు ITR-3 లేదా ITR-4 ఫైల్ చేస్తే, మీ గడువు తేదీ ఆగస్టు 31.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. SIR గడువు పొడిగింపు
ఇది కూడా చదవండి: Silver Price: పాతాళానికి పడిపోతున్న వెండి ధరలు.. పతనానికి కారణాలు ఇవే..!
ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ జోరందుకుంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి