Anand Mahindra: వయసుపై అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఫన్నీ ఆన్సర్.. చూస్తే ఆశ్చర్యపోతారు..

|

Jun 06, 2022 | 9:32 AM

Anand Mahindra: మహీంద్రా & మహీంద్రా చీఫ్ ఆనంద్ మహీంద్రా తరచుగా ట్విట్టర్‌లో తన అభిమానులకు చాలా ఫన్నీ సమాధానాలు ఇస్తుంటారు. ఆయన ప్రత్యేకమైన సమాధానాలు నెటిజన్ల హృదయాలను గెలుచుకోవడంలో కూడా విజయవంతమవుతాయి.

Anand Mahindra: వయసుపై అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఫన్నీ ఆన్సర్.. చూస్తే ఆశ్చర్యపోతారు..
Anand Mahindra
Follow us on

Anand Mahindra: మహీంద్రా & మహీంద్రా చీఫ్ ఆనంద్ మహీంద్రా తరచుగా ట్విట్టర్‌లో తన అభిమానులకు చాలా ఫన్నీ సమాధానాలు ఇస్తుంటారు. ఆయన ప్రత్యేకమైన సమాధానాలు నెటిజన్ల హృదయాలను గెలుచుకోవడంలో కూడా విజయవంతమవుతాయి. ఒక వినియోగదారు ఆనంద్ మహీంద్రా వయస్సు అడిగినప్పుడు కూడా అలాంటిదే జరిగింది. దీనికి సమాధానంగా ఆనంద్ మహీంద్రా షాకింగ్ రీతిలో సమాధానమిచ్చారు. అంకుల్ గూగుల్ సమాధానంపై మీకు నమ్మకం లేదా? అంటూ ఆనంద్ మహీంద్రా తన వయస్సును అడిగిన వ్యక్తికి బదులిచ్చారు. అసులు దీని గురించి తెలుసుకుందాం..

ఆనంద్ మహీంద్రా తన తండ్రికి సంబంధించిన కొన్ని లేఖలను ట్విట్టర్‌లో పంచుకున్నప్పుడు ఈ ప్రశ్న, సమాధానాలు ప్రారంభమయ్యాయి. నిజానికి ఇవి ఉత్తరాలు కావు, ఫ్లెచర్ స్కూల్‌లో అడ్మిషన్ కోసం 1945లో ఆనంద్ మహీంద్రా తండ్రి రాసిన ఉత్తరాలు. ఈ లేఖలు 75 సంవత్సరాలు గోప్యంగా ఉంచబడ్డాయి. గత సంవత్సరం మాత్రమే పబ్లిక్ చేయబడ్డాయి. ఫ్లెచర్ స్కూల్‌లో క్లాస్ డే అడ్రస్ సందర్భంగా ఆనంద్ మహీంద్రాకు ఈ లేఖలు అందించారు.

ఆనంద్ మహీంద్రా తండ్రి హరీష్ మహీంద్రా ఫ్లెచర్ స్కూల్ నుంచి పట్టభద్రుడైన మొదటి భారతీయుడు. తన తండ్రి లేఖ గురించి ఆనంద్ మహీంద్రా ఇలా వ్రాశారు – మా నాన్నగారి ఈ అప్లికేషన్ చదివినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. భారతదేశం స్వాతంత్య్రం పొందనప్పుడు ఆయన అలాంటి సాహసోపేతమైన ప్రకటనతో తన ఆకాంక్షను ప్రదర్శించారు. ఆయన ఆశయాల గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. యువతకు నా సలహా ఏమిటంటే వారి తల్లిదండ్రులతో ఎక్కువగా మాట్లాడి వారి గురించి తెలుసుకోవాలంటూ డా. ఎస్. జైశంకర్ ను ట్యాగ్ చేశారు.

ఆనంద్ మహీంద్రా తండ్రి తన దరఖాస్తులో ఇలా వ్రాశారు – నేను నా వృత్తిపరమైన లక్ష్యాల కోసం విదేశీ సేవను ఎంచుకున్నాను. ఎందుకంటే నా దేశానికి అంతర్జాతీయ వ్యవహారాలపై అవగాహన ఉన్న వ్యక్తులు చాలా అవసరం. ప్రస్తుతం భారత్‌కు సొంతంగా ఎలాంటి విదేశాంగ విధానం లేదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత.. భారతదేశానికి డొమినియన్ హోదా లేదా పూర్తి స్వాతంత్య్రం లభిస్తే, అది ప్రపంచంలోని ఇతర దేశాలతో స్నేహపూర్వక, ఆర్థిక సంబంధాలను ఏర్పరచుకోవడానికి విదేశాంగ విధానంలో శిక్షణ పొందిన వ్యక్తులు అవసరం అంటూ అందులో రాశారు.

ఆనంద్ మహీంద్రా తండ్రి లేఖ